మూడు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్ల అతిపెద్ద రైట్స్ ఇష్యూను జారీ చేసింది. గత 10 ఏళ్లలో నాన్-ఫైనాన్షియల్ ఇష్యూయర్‌లో ప్రపంచంలోనే ఇది అతిపెద్దది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చమురు రంగం నుండి రిటైల్, టెలికం రంగం వరకు విస్తరించిన రిలయన్స్.. రైట్స్ ఇష్యూను మే 20వ తేదీన ప్రారంభించింది. జూన్ 3న ముగుస్తోంది.

10 ఏళ్లలో తొలిసారి..
డయలాజిక్ (సమగ్ర వివరాలు అందించే ఫైనాన్షియల్ మార్కెట్ ప్లాట్‌ఫామ్) డేటా ప్రకారం గత 10 ఏళ్లలో నాన్-ఫైనాన్షియల్ ఇష్యూయర్‌లో రిలయన్స్ రైట్స్ ఇష్యూ అతి పెద్దది. అంతకుముందు 2018 జూన్ నెలలో ప్రస్తుత మొత్తానికి దగ్గరగా ఉండే రైట్స్ ఇష్యూను బైయర్ ఏజీ జారీ చేసింది. అప్పుడు ఇది 7,002 బిలియన్ డాలర్ల ఇష్యూ జారీ చేసింది. మార్చి 2021 నాటికి రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దేందుకు ముఖేష్ అంబానీ వివిధ రూపాల్లో పెట్టుబడులు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా జియో ప్లాట్‌ఫామ్ వాటాలు విక్రయించడంతో పాటు రైట్స్ ఇష్యూకు వచ్చారు.

సోమవారం నాటికే 1.1 రెట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకు రూ.1,257 ధరను కేటాయించింది. కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారు తమ వద్ద గల ప్రతి 15 షేర్లకు ఒక షేరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజుతో ముగుస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ రైట్స్ ఇష్యూకు వచ్చింది. అంతకుముందు 1991లో జారీ చేసింది. ఈ రైట్స్ ఇష్యూకు అనూహ్య స్పందన వచ్చింది. స్టాక్ ఎక్స్చేంజీ డేటా ప్రకారం మరో రెండు రోజులు గడువు ఉండగానే అంటే ఈ నెల 1వ తేదీ నాటికి 1.1 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయ్యారు.

2008 నుండి అతిపెద్ద రైట్ ఇష్యూస్ ఇవే
2008లో ఆర్థిక సంక్షోభం అనంతరం HSBC హోల్డింగ్స్ ఏప్రిల్ 2009లో 19.57 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూను జారీ చేసింది. నాటి నుండి అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే. అక్టోబర్ 2010లో డచ్ బ్యాంకు 13.96 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ జారీ చేసింది. ఇది రెండో అతిపెద్ద రైట్స్ ఇ,్యూ. ఆ తర్వాత యునిక్రెడిట్ 13.69 డాలర్ల మూడో అతిపెద్ద రైట్స్ ఇష్యూ జారీ చేసింది.
ఆసియాలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ 2010 డిసెంబర్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా జారీ చేసింది. దీని వ్యాల్యూ 8.96 బిలియన్ డాలర్లు.

రుణరహిత కంపెనీగా..
గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్ ముగిసేనాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు 3,36,294 కోట్లుగా ఉన్నాయి. క్యాష్ రూపంలో రూ.1,75,259 కోట్లు ఉండగా, నెట్ రుణాలు రూ.1,61,035 కోట్లుగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ విక్రయం ద్వారా రూ.78,000 కోట్లు సమీకరించారు. సౌదీ ఆరామ్‌కోకు చమురు, కెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటా విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోందిత. ఫ్యూయల్ రిటైల్‌లో బీపీసీఎల్‌కు రూ.7,000 కోట్లకు, టెలికమ్యూనికేషన్ టవర్ బిజినెస్‌లో బ్రూక్‌ఫీల్డ్‌కు రూ.25,200 కోట్లకు విక్రయిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications