Reliance: దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నిధుల వేట మొదలెట్టింది. కంపెనీ విస్తరణ కోసం 2 బలియన్ డాలర్లు సేకరించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం విదేశీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు ఓ నివేదిక వెలువడింది.
బాహ్య వాణిజ్య రుణ మార్గం ద్వారా నిధులు సమీకరించాలని రిలయన్స్ యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 3 నుంచి 5 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వ్యవధి ఉండవచ్చని తెలిపింది. రాబడిలో కొంత భాగాన్ని.. సెప్టెంబర్‌లో మెచ్యూర్ అయ్యే రుణాల రీఫైనాన్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తారని అభిప్రాయపడింది.

బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ వంటి రుణదాతలతో చర్చలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. రిలయన్స్ తన చమురు, రసాయనాల వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 5 సంవత్సరాలలో 75 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు గతేడాది ఆగస్టులో తెలిపింది.
ఒకపక్క దేశంలో 5G సేవలను వాయువేగంతో విస్తరించే పనిలో రిలయన్స్ ఉంది. మరోపక్క స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారం జియో సినిమా విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొత్త కంటెంట్ డీల్స్, ప్రసార హక్కుల కొనుగోళ్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తోంది. అనతరం క్రికెట్ టోర్నమెంట్స్‌ను తన ప్లాట్‌ఫారంలో ఉచితంగా అందిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications