విశాఖపట్నం భారతదేశ డేటా రాజధాని కాబోతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్, ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌తో అధికారిక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.
ఈ ఒప్పందం కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను మరోసారి ప్రపంచానికి తెలియజేసిన ఘట్టం. 2030 నాటికి రూ. 98 వేల కోట్ల పెట్టుబడి, 400 ఎకరాల భూమిలో 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబోయే ఈ డాటా సెంటర్, భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.

ఈ ఒప్పందంపై సంతకం అనంతరం.. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'X'లో ఒక ఆసక్తికరమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. భారతదేశం యొక్క డేటా రాజధానిగా వైజాగ్ ఎదుగుతోంది! రూ. 98 వేల కోట్లతో రిలయన్స్ జెవి 1 GW AI డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది ఉపాధి, ఆవిష్కరణలు మరియు ప్రపంచ సాంకేతిక పెట్టుబడులను ఆకర్షిస్తుందని పోస్టులో తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఇదే భావాన్ని మరింత బలంగా పునరుద్ఘాటించారు. వైజాగ్ గ్లోబల్ టెక్ మ్యాప్‌పై కొత్త వెలుగుని నింపబోతోందన్నారు.
ఈ డేటా సెంటర్ పూర్తయిన తర్వాత ఇది భారతదేశంలో అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాల కేంద్రంగా పరిగణించబడుతుంది. AI ప్రాసెసింగ్‌కు కావాల్సిన హై-డెన్సిటీ రాక్‌లు, ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, హై-స్పీడ్ కనెక్టివిటీ.. ఇవన్నీ కలిసి దీన్ని ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిలిచే ఆధునిక సాంకేతిక నగరంగా మార్చబోతున్నాయి. ప్రపంచ టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవలు, హైపర్‌స్కేల్ AI సంస్థలు, అంతర్జాతీయ డేటా ప్రొవైడర్లు.. ఎవరైనా తమ పెద్ద AI కంప్యూటింగ్ అవసరాలను ఇక్కడ నుండే నడిపించగలుగుతారు. ఇది కేవలం డేటా నిల్వ కేంద్రం కాదు.. భారత భవిష్యత్తు ఆర్థిక వృద్ధి కోసం గుండెకోట్లో పుడుతున్న ఎనర్జీ కోర్ అని చెప్పవచ్చు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. నిర్మాణం నుండి డేటా ఆపరేషన్లు, టెక్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, అనుబంధ సేవలు.. అన్నింటిలోనూ స్థానిక యువతకు భారీ అవకాశాలు రాబోతున్నాయి. స్థానిక విక్రేతలతో పాటు విద్యాసంస్థలు, స్టార్టప్‌లు కూడా కొత్త పునాది పొందనున్నాయి.
ప్రపంచం AI విప్లవ దశలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో.. ఇటువంటి మౌలిక సదుపాయాల విలువ మరింత పెరిగింది. దేశంలో నిల్వ అయ్యే డేటా దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆ డేటా కోసం Visakhapatnam ఒక హార్ట్ నగరంగా.. ఒక డిజిటల్ పవర్‌హబ్‌గా మారనుంది. అలాగే భవిష్యత్ టెక్నాలజీ రాజధాని కానుంది.


Click it and Unblock the Notifications