Reliance Jio: అంబానీ కుటుంబానికి రికార్డులు సృష్టించటం కొత్తేమీ కాదు. ధీరూభాయ్ అంబానీ తర్వాత ముఖేష్ అంబానీ ఇదే చేశారు. ప్రస్తుతం ఆయన వారసులు సైతం అదే దారిలో వేగంగా ముందుకు కొనసాగుతున్నారు.
4జీని దేశంలో ప్రవేశపెట్టి టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా తన 5జీ ఆధుతాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా 85 శాతం 5జీ నెట్ వర్క్ స్థాపన ఇప్పటికే పూర్తైనట్లు కంపెనీ చైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ప్రతి 10 సెకన్లకు ఒక 5G సెల్‌ను అమలు చేయగల సామర్థ్యాన్ని తాము కలిగి ఉన్నట్లు వెల్లడించారు.

బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ అండ్ క్వాలిటీ పరిశీలింటే సంస్థ Ookla తాజాగా రిలయన్స్ జియో 5జీ సామర్థ్యాలు, విస్తరణకు సంబంధించిన గణాంకాలను ప్రకటించింది. ఇదే తరుణంలో కంపెనీ ముందుగా పెట్టుకున్న లక్ష్యం ప్రకారం డిసెంబర్ 2023 నాటితి దేశంలో ప్రతి ప్రాంతాన్ని తమ 5జీ నెట్‌వర్క్ కిందకు తీసుకొచ్చేందుకు వేగంగా పనిచేస్తోంది. గడచిన ఏడేళ్లలో కంపెనీ అనేక గ్లోబల్ బెంచ్ మార్కులను ఏర్పాటు చేసిందని అనంత్ తెలిపారు. భారత డిజిటల్ భవిష్యత్తుపై తాము తమకు నమ్మకం ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా భారత్ ప్రపంచ వేదికపై అగ్రగామిగా మారడానికి సహాయం చేస్తుందన్నారు.
మెుత్తం తొమ్మిది స్పీడ్‌టెస్ట్ అవార్డులను గెలుచుకున్న జియో భారతదేశంలో నంబర్-1 నెట్‌వర్క్‌గా అవతరించిందని ఊక్లా తాజాగా ప్రకటించింది. అన్ని కేటగిరీల్లో ఏకకాలంలో అవార్డులను అందుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలికాం ప్రొవైడర్లలో తొలిసారిగా రిలయన్స్ జియో సరికొత్త రికార్డు సృష్టించిందని ఊక్లా వెల్లడించింది.
ఉత్తమ మొబైల్ నెట్‌వర్క్, వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజ్, టాప్-రేటింగ్ మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ మొబైల్ వీడియో అనుభవం, ఉత్తమ మొబైల్ గేమింగ్ అనుభవం, వేగవంతమైన 5G మొబైల్ నెట్‌వర్క్, ఉత్తమ 5G మొబైల్ వీడియో అనుభవం, ఉత్తమ 5G మొబైల్ గేమింగ్ అనుభవం కేటగిరీల్లో Jio అవార్డులను గెలుచుకుంది. ఉత్తమమైన వాటిని అందించాలనే జియో ఆశయాన్ని ఇవి పునరుద్ఘాటిస్తున్నాయని Ookla ప్రెసిడెంట్, CEO స్టీఫెన్ బై పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications