దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరిట ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను విడుదల చేసింది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లు వినియోగదారులకు అధిక డేటా, అపరిమిత కాల్స్‌తో పాటు ఆధునిక ఏఐ సదుపాయాలను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా నెలవారీ ప్లాన్, ఏడాది ప్లాన్ రెండింటిలోనూ Google Gemini Pro ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇవ్వడం ఈ ఆఫర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హీరో యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్: ఏడాది పాటు ఒకే రీఛార్జ్‌తో మొబైల్ సేవలను ఉపయోగించాలనుకునే వినియోగదారుల కోసం జియో ప్రత్యేకంగా హీరో యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్ ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ ధర రూ. 3,599. ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వినియోగదారులకు ఇది అనుకూలమైన ప్లాన్ అని జియో తెలిపింది.

ఇదే కాకుండా, ఈ యాన్యువల్ ప్లాన్‌కు అదనపు ప్రయోజనంగా Google Gemini Proకు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నారు. దీని ద్వారా ఏఐ ఆధారిత రైటింగ్, అనాలిసిస్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను వినియోగించుకోవచ్చు. దీర్ఘకాలికంగా రీఛార్జ్ చేసి ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా మారనుంది.
సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ : తక్కువ కాలానికి ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకునే వారి కోసం జియో సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 500. ఈ ప్లాన్‌కు 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఈ మంత్లీ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి.
అదనంగా, వినియోగదారులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలు అయిన యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 వంటి సేవల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే.. ఈ మంత్లీ ప్లాన్‌కు కూడా 18 నెలల ఉచిత Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్ జత చేశారు. డేటాతో పాటు వినోదం, ఏఐ సేవలు కావాలనుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఆఫర్‌గా నిలుస్తోంది.
ఫ్లెక్సీ ప్యాక్ : జియో మరో కొత్త ఎంపికగా ఫ్లెక్సీ ప్యాక్ ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ ధర రూ. 103 కాగా.. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇది పూర్తిగా డేటా ఓన్లీ ప్లాన్. ఈ ఫ్లెక్సీ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు హిందీ, అంతర్జాతీయ లేదా ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక అవసరాల కోసం అదనపు డేటా కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
క్లుప్తంగా చూసుకున్నట్లయితే.. రిలయన్స్ jio హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్‌లు డేటా వినియోగం ఎక్కువగా ఉపయోగించే వారు, ఏడాది రీఛార్జ్ కోరుకునే వారు, అలాగే ఓటీటీ, ఏఐ సేవలను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయి. నూతన సంవత్సరంలో జియో ఈ ప్లాన్‌లతో వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications