Reliance Jio: వేలకోట్లు అప్పుతీసుకుంటున్న అంబానీ.. అదిరే రేంజ్‌లో భవిష్యత్ ప్లానింగ్
Reliance Jio: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ జియో.. నిధుల సేకరణకు దిగింది. 5G నెట్‌వర్క్ విస్తరణ కోసం ఈ అమౌంట్ ను వెచ్చించాలని నిర్ణయించుకుంది. 2023 చివరినాటికి ఇండియాలోని ప్రతి పట్టణం, నగరానికి 5Gని అందుబాటులోకి తీసుకురావాలని లక్షంగా పెట్టుకుంది. దీన్ని సాకారం చేసుకునేందుకు ఇన్వెస్ట్మెంట్స్ స్వీకరణకు మొగ్గుచూపుతోంది.
BNP పరిబాస్ సాయంతో 2 బిలియన్ డాలర్ల వరకు ఆఫ్‌షోర్ లోన్లు సేకరించడానికి జియో సిద్దమైంది. ఎరిక్సన్ నుంచి 5G గేర్ పొందడం కోసం వీటిని వినియోగించనుంది. మొత్తం 9 నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని రుణంగా పొందడానికి రిలయన్స్ ప్లాన్ చేసింది. రాయితీ ప్రక్రియ ద్వారా ఈ నిధులు అందుకోనున్నట్లు ప్రముఖ మీడియా నివేదిక వెల్లడించింది.

అయితే ఇదే 9 నెలల వ్యవధిలో ఓ వైపు BNP పరిబాస్ నుంచి లోన్ తీసుకుంటూనే, మరోపక్క బ్యాంకులు సహా పరిబాస్‌కు కూడా తిరిగి చెల్లించాలని చూస్తోంది. అందువల్ల వడ్డీ భారం కూడా తక్కువగానే నమోదు కానుంది. ఇటీవల స్వీడన్ కు చెందిన ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ EKN.. జియోకు 2.2 బిలియన్ డాలర్ల బీమా కవర్ అందించింది. తద్వారా రుణదాతల్లో భయాందోళనలను అవకాశం లేకుండా పోయింది.
జియో ఇప్పటికీ 50 మిలియన్ల 5G కస్టమర్ బేస్ సొంతం చేసుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఎక్కువ మంది 5G ఫోన్లకు అప్డేట్ కావడం, నెట్వర్క్ పరిధి పెంచడం వల్ల ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పటికైతే 5G ద్వారా టెల్కోలు పెద్దగా ఆర్జించనప్పటికీ.. భవిష్యత్తులో వృద్ధి భరోసాతో జియో భారీగా విస్తరణ ప్రణాళికలు రచించింది.


Click it and Unblock the Notifications