Tata-Reliance: చైనాను ఢీ కొడుతున్న టాటా, రిలయన్స్.. కింగ్ మేకర్స్ గా మారనున్న కంపెనీలు..
Tata-Reliance: ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ఇతర ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని దేశాలకు కంపెనీలు దూరంగా జరుగుతున్నాయి. ఈ నిర్ణయాలు మరికొన్నింటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండేళ్ల కిందట చైనా నుంచి చాలా కంపెనీలు వెళ్లిపోవాలని నిర్ణయించిన సమయంలో అవి వియత్నాంను ఎంచుకున్నాయి. దీంతో 2022లో ఆ దేశ జీడీపీ 8.02 శాతానికి పెరుగుతుందని అంచనా. 1997 తర్వాత ఈ స్థాయి వృద్ధి ఇదే తొలిసారి.

చైనాపై నిషేధం..
ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగం చాలా వేగంగా విస్తరిస్తోంది. కొత్త జనరేషన్ హై స్పీడ్ సర్వీసులతో చాలా దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో చైనాలో తయారైన టెలికాం పరికరాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ విభాగంలో భారీ శూన్యత ఏర్పడింది. ఈ నిర్ణయంతో రిక్సన్ భారీ వ్యాపారాన్ని పొందుతోంది.

భారత అవకాశాలు..
5జీ పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజూకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవటంతో.. భారతదేశంలో తయారైన 5G పరికరాలకు గ్లోబల్ మార్కెట్‌లో భారీ అవకాశం ఉంది. టెలికాం రంగంలో పెద్ద పోటీగా ఉన్న చైనాకు ప్రపంచం చెక్ పెడుతుండగా ఈ ప్రయాణంలో భారత్‌కు చాలా అవకాశాలు వచ్చాయి.

రేసులో టాటా- రిలయన్స్ జియో..
5జీ టెలికాం పరికరాల సరఫరా అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టాటా గ్రూప్, రిలయన్స్ జియో అగ్రగామిగా మారాయి. టాటా గ్రూప్ అభివృద్ధి చేసిన 4G ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించడం ద్వారా BSNL మార్కెట్లో తన వేగాన్ని పెంచింది. ఇదే సమయంలో జియో సైతం తన సొంత 5జీ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారతదేశానికి అమెరికా సహాయం చేయగలదని ప్రొఫెసర్ ఏజే బాల్‌రాజ్ అభిప్రాయపడ్డారు.

బాల్‌రాజ్ ఆవిష్కరణ..
ప్రొఫెసర్ AJ బాల్‌రాజ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మల్టిపుల్-అవుట్‌పుట్ (MIMO) సాంకేతికతను కనుగొన్నారు. ఇది రోజువారీ వినియోగించే Wi-Fi, 4G, 5G వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల్లో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశ 5G రోడ్‌మ్యాప్‌పై పని చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి ఫోరమ్‌కు ప్రొఫెసర్ AJ బాల్‌రాజ్ అధ్యక్షత వహించారు.

టీసీఎస్ దేశీయ 4జీ..
దేశంలో 4G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టడానికి దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో BSNL ఒప్పందం కుదుర్చున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ దాదాపు రూ.16,000 కోట్లుగా ఉంది. దీనిద్వారా టాటా గ్రూప్ సొంత సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇందుకోసం టాటాలకు చెందిన టీసీఎస్ ప్రభుత్వ సంస్థలైన ప్రభుత్వ సంస్థ C-DOT, ITI 4G నెట్‌వర్క్, పరికరాలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications