Reliance JIO: ఇంటర్నెట్‌పై యుద్ధం ప్రకటించిన అంబానీ.. ఆందోళనలో Airtel..
Reliance JIO: ముఖేష్ అంబానీ దేశంలో ఒకటి తర్వాత మరొక వ్యాపారంపై వరుసగా యుద్ధం ప్రకటిస్తున్నారు. రిలయన్స్ జియో విజయంతో ప్రారంభమైన ఈ దండయాత్ర ఆ తర్వాత ఓటీటీ, రిటైల్, ఫైనాన్స్ రంగాల వరకు విస్తరించింది. తాజాగా ఆయన ఇంటర్నెట్ వ్యాపారంపై ఫోకస్ పెట్టారు.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో 2016లో భారత టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కంపెనీ ఇప్పుడు వినియోగదారుల ఇంటర్నెట్ రంగంలోనూ సందడి చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. పండుగ సీజన్‌లో కంపెనీ తన ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(FWA) పరికరం Jio AirFiberని ప్రారంభించాలని చూస్తోంది. ఇతర కంపెనీల కంటే 20 శాతం తక్కువ ధరలకే సేవలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఆగస్టు 29న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో దీనిపై అంబానీ కిలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.

జియో ఇప్పటివరకు భారీ ఆఫర్లతో కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించవచ్చు. జియో తన 5G రోల్‌అవుట్ పూర్తయిన నగరాల్లో వినియోగదారుల ట్రయల్స్ ప్రారంభించినట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ ఎంపిక చేసిన వినియోగదారులకు పరికరాలను కూడా అందించింది. తద్వారా లాంచ్‌కు ముందు పూర్తిగా పరీక్షించబడుతుంది. ఇది వివిధ 5G ఎయిర్‌వేలను ఉపయోగించి డేటా పాత్‌వేని సృష్టిస్తుంది.
ఈ నెల ప్రారంభంలో భారతీ ఎయిర్‌టెల్ తన FWA ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌ను ముంబై, ఢిల్లీలో ప్రారంభించింది. దీని పరికరం ధర రూ.2,500. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.799 నుంచి కంపెనీ నిర్ణయించింది. ఆరు నెలల ప్యాకేజ్ కొనుగోలుకు రూ.7,300 వసూలు చేస్తోంది కంపెనీ. అయితే మార్కెట్లోకి అడుగుపెట్టనున్న జియో తన సేవలను కొంత కాలం పాటు తక్కువ ధరకు లేదా ఉచిత ట్రయల్‌ను అందించవచ్చని తెలుస్తోంది. దేశంలో డేటా వినియోగం పెరుగుతున్న తరుణంలో FWA వినియోగాన్ని పెంచే అన్ని అవకాశాలను కంపెనీలు అన్వేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications