Reliance News: వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త.. 30% డిస్కౌంట్‌తో కొత్త కనెక్షన్.. త్వరపడండి!
Jio freedom offer: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుతం సమయంలో పలు మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్ఀాయి. రెవెన్యూ పెంచుకోవాలనే ఉద్దేశంతో వివిధ టెల్కోలు రీఛార్జ్ రేట్లు పెంచేశాయి. ప్రజలకు గతంలో అందుబాటులో ఉన్న ధరలకు ఇప్పటికీ భారీ వ్యత్యాసం ఉన్నాయని సగటు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో రిలయన్స్ జియో ఓ వద్దనలేని ఆఫర్ రిలీజ్ చేసింది.
రిలయన్స్ జియో తన ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా కొత్త ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌లపై 30 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. అంటే కొత్త వినియోగదారులకు ఇన్‌స్టాలేషన్ ఛార్జీ 1 వెయ్యి మినహాయిస్తోంది. కాగా ఆఫర్‌ను అనుసరించి కనెక్షన్ కోసం మిగతా 2 వేల 121 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జూలై 26 నుండి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ పొందడానికి మొదటగా రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఆసక్తిని నమోదు చేసుకోవడం లేదా 60008-60008కి మిస్డ్ కాల్ ఇస్తే సరి. సదరు టీం మిగతా విషయాలను వివరిస్తుంది. ఆగస్టు 15 నాటికి యాక్టివేట్ చేయబడిన అన్ని కొత్త బుకింగ్‌లు మరియు ఇప్పటికే ఉన్న బుకింగ్‌లు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులు. అన్ని ప్లాన్ల వ్యవధి 3, 6 లేదా 12 నెలలుగా ఉంది.
జియో సహా టెల్కోలు అన్నీ ఇటీవల తమ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు 25 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో యూజర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వినియోగదారుల ప్రతిస్పందన ఆధారగా ట్రాయ్ రంగంలోకి దిగిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టకపోతే టెలికాం రంగం సంక్షోభంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications