Jio 5G: కొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ జియో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
Jio 5G: ఇండియాను డిజిటల్ యుగం వైపు నడించటానికి రిలయన్స్ జియో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులు పెడుతూ 5జీ సాంకేతికతను దేశంలోని వివిధ నగరాలకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

17 రాష్ట్రాల్లో..
ఈ రోజు రిలయన్స్ జియో ట్రూ-5జీ సేవలను ప్రారంభించిన జాబితాలో కొత్త నగరాలు చేర్చబడ్డాయి. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో ఏకకాలంలో 5Gని ప్రారంభించడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఝాన్సీ, కోటా, బికనీర్, అంబాలా, ధన్‌బాద్, పూరీ మెుదలైన నగరాలు ఉన్నాయి.

మెుత్తం 184 నగరాల్లో..
ఈరోజు జియో కొత్తగా 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించటంతో.. 5G నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన నగరాల సంఖ్య 184కి చేరుకుంది. ఇందులో హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో- 7, ఒడిశాలో- 6, కర్ణాటకలో- 5, ఛత్తీస్‌గఢ్-3, తమిళనాడు-3, మహారాష్ట్ర-3, రాజస్థాన్-2, పశ్చిమ బెంగాల్-2, అస్సాం, జార్ఖండ్, కేరళ, పంజాబ్, తెలంగాణలో ఒక్కొ నగరంలో సేవలను జియో ప్రారంభించింది. ఈ నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించిన తొలి, ఏకైక ఆపరేటర్‌గా రిలయన్స్ జియో అవతరించింది.

ఏ కస్టమర్లు 5G సేవను పొందుతారు..?
రిలయన్స్ ఈరోజు 5G సేవను ప్రారంభించిన నగరాల్లో Jio వినియోగదారులు వెల్‌కమ్ ఆఫర్ కింద ఆహ్వానించబడతారు. ఇలా ఆహ్వానం పొందిన వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందుతారు. ఇది దేశంలోనే మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా 5G సేవల అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి.

తెలుగు రాష్ట్రాల్లో 5జీ నగరాలు..
ఏపీలో జియో 5జీ సేవలు చిత్తూరు, కడప, నర్సరావు పేట, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల్లో ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కేవలం నల్గొండలో మాత్రమే ఈ రోజు కొత్తగా జియో 5జీ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి ముందు విడతలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాలను జియో కవర్ చేసింది.


Click it and Unblock the Notifications