Starlink: భారతీయ టెలికాం రంగంలో పెద్ద మార్పు మెుదలైంది. ఇంటర్నెట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా టాప్ టెలికాం కంపెనీలు అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్‌తో ప్రస్తుతం జతకడుతున్నాయి.
నిన్న భారతీయ టెలికాం టాప్ ప్లేయర్ అయిన ఎయిర్‌టెల్ తాను ఎలాన్ మస్క్ కంపెనీతో జోడీ కట్టినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు జియో-స్పేస్ఎక్స్ భాగస్వామ్యంగా పని చేయనున్నాయి. దేశంలో స్టార్లింక్ సేవలను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ఒక అడుగు ముందుగా ఎయిర్‌టెల్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం స్పేస్ఎక్స్ భారతదేశంలో స్టార్‌లింక్ సేవలను విక్రయించడానికి అనుమతి పొందితే జియో-స్పేస్ఎక్స్ తమ సేవలను వినియోగదారులు, వ్యాపారాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు కలిసి పనిచేస్తాయని తెలుస్తోంది. జియో, స్టార్‌లింక్ పరికరాలను తన రిటైల్ ఔట్‌లెట్లలో, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంచేందుకు యోచిస్తోంది. ఇది దేశంలో నిరంతర, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి జియో కస్టమర్ బేస్ దోహదపడుతుంది.
ప్రస్తుతం రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్నప్పటికీ.. స్పేస్ఎక్స్, తక్కువ భూమి కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలును ప్రయోగించే సంస్థగా ప్రముఖంగా నిలబడింది. రెండు కంపెనీల భాగస్వామ్యం భారత్‌లోని గ్రామీణ, దూర ప్రాంతాలకు కూడా నమ్మదగిన నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు దోహదపడుతుందని తెలుస్తోంది. దేశంలోని ప్రతి భారతీయుడు ఎక్కడ ఉన్నప్పటికీ అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ పొందేలా చూడటం తమ లక్ష్యంగా జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ ఊమ్మెన్ పేర్కొన్నారు. స్పేస్ఎక్స్‌తో ఈ భాగస్వామ్యం, ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక అడుగుగా ఆయన పేర్కొన్నారు.
ఒప్పందం కిం JioAirFiber, JioFiber వంటి సేవలతో కూడిన ప్రాంతంలో ప్రత్యేకమైన మార్గం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. జియో-స్పేస్ఎక్స్ ఇంకా భారత్‌లో డిజిటల్ పరిష్కారాలను మెరుగుపరిచేందుకు తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను ఉపయోగించడంపై అనేక ఇతర సహకార అవకాశాలను పరిశీలిస్తున్నారు. జియో భారతదేశంలో కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు చేయు ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ అన్నారు. భారతదేశంలో స్థిరమైన అధిక-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడంలో జియోతో కలిసి పని చేయాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్పేస్ఎక్స్ భారత ప్రభుత్వంతో డేటా లోకలైజేషన్ మరియు భద్రతా ప్రమాణాలను తీసుకురావడంపై అంగీకరించింది. అలాగే Eutelsat OneWeb, Jio's SES సంయుక్త ఎంటర్‌ప్రైజ్ ఇప్పటికే GMPCS అనుమతులు పొందినట్లు పత్రికా వార్తలు వెల్లడించాయి. భారతదేశం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2033 నాటికి 44 బిలియన్ల డాలర్ల విలువను చేరుకునే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications