గుడ్‌న్యూస్: అందుబాటులోకి రూ.98, రూ.149 ప్లాన్స్, డేటా-బెనిఫిట్స్ ఇవే...
ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో తన రెండు పాత ప్లాన్స్‌ను తాజాగా పునరుద్ధరించింది. డిసెంబర్ 6వ తారీఖు నుంచి కొత్త ప్లాన్ ధరలను సవరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.98, రూ.149 ప్లాన్స్‌ను తొలగించింది. అయితే ఇప్పుడు ఆ రెండు ప్లాన్స్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు మూడ్రోజుల క్రితం ఔట్ గోయింగ్ కాల్స్ పైన పరిమితి ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే అలా చేసినప్పటికీ తమ ధరలే చౌక అని జియో రెండు రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా, పాత ప్లాన్స్ తెచ్చింది.

రూ.98 ప్లాన్
తాజాగా తీసుకు వచ్చిన రూ.98 ప్లాన్ కింద 28 రోజుల కాల పరిమితితో 2GB డేటా లభిస్తుంది. 300 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. జియో నుంచి జియోకు ఉచితంగా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే జియో యాప్స్ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇతర నెట్ వర్క్స్‌కు చేసే కాల్స్‌పై నిమిషానికి ఆరు పైసలు చెల్లించాల్సి ఉంటుంది. పరిమితి ముగిసిన అనంతరం డేటా స్పీడ్ 64Kbpsకు పరిమితమవుతుంది.

రూ.149 ప్లాన్
రూ.149 ప్లాన్ కింద రోజుకు 1GB డేటా వస్తుంది. జియో నుంచి జియోకు కాల్స్ ఉచితం. రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. ఇతర నెట్ వర్క్స్‌కు 300 నిమిషాల కాల్స్ ఉచితం. ఈ ప్లాన్ గడువు 24 రోజులు. జియో యాప్స్ వినియోగించుకోవచ్చు. ఈ రెండు ప్లాన్స్ జియో అధికారిక వెబ్ సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

IUC ఛార్జీలు
ఈ రెండు ప్లాన్స్‌లో నాన్ జియో కాల్స్‌కు యూజర్ సపరేట్‌గా IUC ప్లాన్‌ను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు రూ.10 IUC ప్లాన్ కింద 124 IUC నిమిషాలు వస్తాయి. ఆ తర్వాత చేసే ప్రతి కాల్‌కు ఆరు పైసలు పడుతుంది.


Click it and Unblock the Notifications