రూ.2,520 కోట్లతో జియో అదరగొట్టింది.. లాక్‌డౌన్ టైంలో లాభాలు మూడింతలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ఇన్ఫోకామ్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 3రెట్ల లాభాలు ఆర్జించింది. వరుసగా 11వ క్వార్టర్‌లో మంచి లాభాలు మూటగట్టుకుంది. గత కొంతకాలంగా కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. జూన్ క్వార్టర్‌లో జియో రూ.2,520 కోట్ల లాభాలు నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.891 కోట్లుగా ఉంది. అంటే దాదాపు మూడు రెట్ల లాభాలు వచ్చాయి. క్వార్టర్ పరంగా రెవెన్యూ 34 శాతం ఎగిసి రూ.16,557 కోట్లుగా ఉంది.

పెరిగిన జియో ఆర్పు
బలమైన, సురక్షితమైన వైర్‌లెస్, డిజిటల్ నెట్ వర్క్‌ను నిర్మించడం ద్వారా, డిజిటల్ కనెక్టివిటీ ప్రయోజనాలను భారత్‌లోని ప్రజలకందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్లు జియో ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టారని, 13 మంది ప్రపంచ టెక్ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయని తెలిపారు. కాగా జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) రూ.140.3 కు పెరిగింది. జనవరి -మార్చి క్వార్టర్‌లో ఇది రూ.130.6గా ఉంది.

పెరిగిన జియో యూజర్లు, నెట్ వాడకం
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 15.1 మిలియన్ల మంది కొత్తగా జియో నెట్ వర్క్ తీసుకున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ ఇబ్బందులు ఉన్నప్పటికీ జియో యూజర్లు పెరిగారని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. కరోనా, లాక్ డౌన్ కారణాల వల్ల వైర్‌లెస్ డేటా వినియోగం సగటున నెలకు 12.1 జీపీకి పెరిగిందని, అలాగే వాయిస్ కన్సంప్షన్ 756 నిమిషాలకు పెరిగిందని తెలిపింది.

జియో ప్రాఫిట్ నుండి డేటా వరకు..
- రిలయన్స్ జియో స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ రూ.2,520 కోట్లుగా ఉంది.
- జూన్ 30, 2020 నాటికి వినియోగదారులు 398.3 మిలియన్లు.
- ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఆర్పు రూ.40.3గా ఉంది.
- ఈ క్వార్టర్‌లో వైర్‌లెస్ డేటా ట్రాఫిక్ 1,420 కోట్ల జీబీ. ఏడాది ప్రాతిపదికన ఇది 30.2 శాతం పెరిగింది.
- ఈ క్వార్టర్లో టోటల్ వాయిస్ ట్రాఫిక్ 88.944 కోట్ల నిమిషాలు. ఏడాది ప్రాతిపదికన ఇది 13.2 శాతం పెరిగింది.
- ఆపరేషన్, యాక్సెస్ రెవెన్యూ కలిపి స్టాండలోన్ రెవెన్యూ రూ.16,557 కోట్లు.
- స్టాండలోన్ ఎబిటా రూ.7,281 కోట్లు. ఎబిటా మార్జిన్ గత ఏడాది 37.8 శాతంగా ఉండగా ఇప్పుడు రూ.44.0కు పెరిగింది.


Click it and Unblock the Notifications