JIO 6G: 6జీ సాంకేతికతపై అంబానీ దృష్టి.. Airtel, VI, BSNL షాక్.. ప్రపంచంలో..
JIO 6G: సోమవారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ కంపెనీ భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రణాళికల గురించి వెల్లడించారు.
ఈ క్రమంలో ఇప్పటికే టెలికాం రంగంలో దిగ్గజంగా కొనసాగుతున్న జియో.. ఇంటర్నెట్ యూజర్లను టార్గెట్ చేసుకుని అనేక సేవలను అందుబాటులోకి తెలుస్తోంది. ఈ క్రమంలో జియో ప్లాట్‌ఫారమ్ లు కీలక భూమిక పోషిస్తున్నాయి. అయితే ఇవి భవిష్యత్తు టెక్నాలజీలకు అనుగుణంగా 6జీ సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండేవిగా అభివృద్ధి చేస్తున్నట్లు అంబానీ వెల్లడించారు. ప్రపంచంలో ఈ తరహా చర్యలు చేపట్టిన సంస్థల్లో జియో మెుదటి స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా అనేక నగరాలకు తన 5జీ నెట్‌వర్క్ సేవలను విస్తరించే పనిలో వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ వంటి సంస్థలతో కలిగి పనిచేస్తోంది. వారి నుంచి అవసరమైన టెలికాం సామాగ్రిని కొనుగోలు చేస్తోంది. ఇదే క్రమంలో జియో ప్లాట్‌ఫారమ్‌లు తమ వినూత్నమైన "మేడ్-ఇన్-ఇండియా" టెక్నాలజీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయాలని, విస్తరించాలని కోరుకుంటున్నట్లు అంబానీ తెలిపారు.
దీనికి తోడు రిలయన్స్ జియో ప్లాట్ ప్లాట్‌ఫారమ్ లు చాట్ జీపీటీ మాదిరిగా తమ సొంత ఏఐ సిస్టమ్ సిద్ధం చేసుకుంటున్నట్లు ముఖేష్ అంబానీ ఏజీఎంలో వెల్లడించారు. దేశంలోని ప్రతి వ్యక్తికి ఏఐ అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కువ పరికరాలు కనెక్ట్ అవటంతో పాటు అధిక ఇంటర్నెట్ స్పీడ్ 6జీ సాంకేతికత రానున్న కాలంలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీనిపై రిలయన్స్ గ్రూప్ భారీగా పెట్టుబడులను కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఆందోళనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications