Ambani News: అంబానీ విధ్వంసకర ప్లాన్.. ఆ దేశానికి జియో టెలికాం సేవల విస్తరణ..
Mukesh Ambani: అంబానీ ఏదైనా రంగంపై కన్నేశాడంటే దానిలో అగ్రగామి స్థాయికి చేరుకునేందుకు పోటీదారులను తన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడని మనందరికీ తెలిసిందే. ఉచితాలతో ఊరించి ప్రత్యర్థులను మట్టికరిపించటంలో ఆయన సాటి ఎవరూ లేరని చెప్పొచ్చు.
ఇండియాలో రిలయన్స్ జియో రాక టెలికాం రంగంలో పెనుమార్పులను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జియో ఫ్లాట్ ఫారమ్ విలువ అక్షరాలా 107 బిలియన్ డాలర్లను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ BofA వెల్లడించింది. అయితే దీనిని ఇక్కడితో ఆపకూడదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలోనే జియో సేవలు పొరుగున ఉన్న శ్రీలంకకు విస్తరించే యోచనలో ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ క్రమంలో జియో ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ అయిన శ్రీలంక టెలికాం పిఎల్‌సిలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది.

ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం డబ్బును సేకరించేందుకు ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలను ప్రైవేటీకరించాలని చూస్తోంది. కొలంబో కేంద్రంగా పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. జనవరి 12న గడువు ముగిసిన తర్వాత జియో ప్లాట్‌ఫారమ్‌లు, Gortune ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, Pettigo Comercio International సంస్థలు తమ బిడ్ లను దాఖలు చేశాయి. ప్రస్తుతం ఇవి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐఎమ్ఎఫ్ శ్రీలంకలోని నాన్ కోర్ రంగాలను ప్రైవేటీకరించాలని ద్వీపదేశానికి తప్పనిసరి చేసింది.
ప్రస్తుతం భారత్ లో నెంబర్-1 స్థానాన్ని అధిరోహించిన తర్వాత జియో పొరుగున ఉన్న శ్రీలంక మార్కెట్లోకి వ్యూహాత్మకంగా ఉడుగుపెట్టాలని చూస్తోంది. బ్రోకరేజ్ బోఫా ప్రకారం జియో తన అధునాతన ఫీచర్ ఫోన్ జియోభారత్, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ పరికరం జియోఎయిర్‌ఫైబర్‌తో లోతుగా ప్రవేశించేటప్పుడు జియో ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఏడాది సబ్‌స్క్రైబర్‌లను జోడించడాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు ఒక నోట్‌లో పేర్కొంది.


Click it and Unblock the Notifications