Jio News: కస్టమర్లకు జియో ఉచిత డేటా ఆఫర్లు.. కంగుతిన్న Airtel, BSNL, Vi..
Jio News: ఇంటర్నెట్ సౌకర్యం అంటే దేశంలో జియో పుట్టుకకు ముందు ఆ తర్వాత చాలా మార్పులకు లోనైంది. అంబానీలకు చెందిన టెలికాం కంపెనీ భారతీయులకు టెక్నాలజీని అత్యంత చేరువ చేసింది.
కంపెనీ తన ఏడవ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తన ప్రియమైన వినియోగదారులకు అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్ కింద యూజర్లు 21 జీబీ ఉచిత డేటాతో పాటు అదనపు ప్రయోజనాలను పొందుతారని వెల్లడించింది. అయితే ఈ ఫీచర్లు కేవటం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ అందిస్తున్న రూ.299, రూ.749, రూ.2,999 రీఛార్జ్ ప్లాన్ల కింద ఈ బెనిఫిట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 299 ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 100 SMSలతో పాటు రోజుకు 2GB డేటాను అందిస్తోంది. అలాగే 28 రోజుల వ్యాలిడిటీతో జియో వార్షికోత్సవ ఆఫర్‌లో భాగంగా 7GB అదనపు డేటాను అందిస్తోంది. 749 ప్లాన్ కింద రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్,రోజుకు 100 SMSలతో పాటు కస్టమర్లు 14GB అదనపు డేటాను ఉచితంగా పొందుతారు. ఇక చివరిగా 2,999 ప్లాన్ కింద రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలతో పాటు 21GB అదనపు డేటాను కూపన్ల రూపంలో పొందుతారు.
అలాగే రూ.149 అంతకంటే ఎక్కువ ప్లాన్ కొనుగోలు చేస్తే మెక్‌డొనాల్డ్స్ భోజనాన్ని ఉచితంగా అందిస్తుంది. రిలయన్స్ డిజిటల్‌పై 10 శాతం తగ్గింపు, విమానాలపై రూ.1,500 వరకు తగ్గింపు, హోటళ్లపై 15 శాతం గరిష్ఠంగా రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలు AJIOపై 20 శాతం తగ్గింపు, నెట్‌మెడ్‌లపై 20 శాతం తగ్గింపు అంటే రూ.800 వరకు తగ్గింపులను పొందుతారు. కంపెనీ తీసుకొచ్చిన డేటా ఫ్రీ ఆఫర్లతో మార్కెట్లోని ఇతర ప్రత్యర్థి కంపెనీ ఆందోళనకు గురవుతున్నాయి.


Click it and Unblock the Notifications