Jio 5G Plans: టెలికాం రంగంలో రోజురోజుకూ పోటీ తారా స్థాయికి వెళుతోంది. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం తమ కస్టమర్లకు 5జీ సాంకేతిక సేవలను పరిచయం చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇందుకు ఆఫర్ల గాలం వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తక్కువ ధరలకు అంబానీకి చెందిన జియో ఏడాది ప్లాన్లను పరిచయం చేసింది. దీని ద్వారా వినియోగదారులు 365 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా కంపెనీ అపరిమిత 5G డేటా, OTT యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక మంది ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉండే అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా మారిందని తెలుస్తోంది.

రూ.3,662 ప్లాన్..
జియో తన రూ.3,662 ప్లాన్ కింద 365 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. ఈ ప్యాక్ కింద వినియోగదారులు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి ప్రతిరోజూ 2.5 GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో కంపెనీ అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5G డేటాను కూడా ఇస్తోంది. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత SMSలతో పాటు Sony Liv, ZEE5, Jio సినిమా, Jio TV ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
రూ.3,227 ప్లాన్..
రూ.3,227 ప్లాన్ కింద యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. దీనికింద రోజూ 2 జీబీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగదారులు పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటాను కూడా అందిస్తుంది. ప్లాన్‌లో కంపెనీ అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMSలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు అందిస్తోంది. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమాలకు కూడా ఉచిత యాక్సెస్ ఉంది.
రూ.2,999 ప్లాన్..
జియో తన యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీతో రూ.2,999 వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంచింది. దీని కింద ప్రస్తుతం ప్రతిరోజూ 2.5 జీబీ డేటాను అందిస్తోంది. అలాగే అర్హత కలిగిన వినియోగదారులకు కంపెనీ ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా మీకు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఉచిత SMSలు ఉన్నాయి. ఈ ప్లాన్ జియో టీవీతో పాటు జియో సినిమా, జియో క్లౌడ్‌కు యాక్సెస్‌ను అందిస్తోంది. విశేషమేమిటంటే ఈ ప్లాన్‌తో దీపావళి ఆఫర్‌లో కంపెనీ వినియోగదారులకు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా ఇస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications