BSNL Vs Jio: బీఎస్ఎన్ఎల్ దెబ్బకి దిగొచ్చిన జియో.. అంబానీ ప్రకటించిన సూపర్ ఆఫర్..
Jio 999 Plan: దేశీయ టెలికాం వ్యాపారంలోని ఆరోగ్యకరమైన పోటీ జియో రాకతో చెడిపోయిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ తన జియోను మార్కెట్లో వినియోగదారులకు చేరువ చేసేందుకు ఏడాది పాటు ఉచితంగా డైలీ డేటా ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారతీయ మార్కెట్లో అనేక మంది ఆటగాళ్లు మాయమయ్యారు. అయితే దశాబ్థం తర్వాత కర్మ ఈజ్ బూమరాంగ్ అన్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ పెద్ద పోటీని ఇస్తూ జియోను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అనంత్ అంబానీ పెళ్లి సమయంలో జియో దేశీయంగా టారిఫ్ రేట్లను పెంచిన యూజర్ల నుంచి పెద్ద నిరసన వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కి మారిపోతున్నారు. ఈ క్రమంలో జియో తన కస్టమర్లకు ఒక సరసమైన ప్లాన్ ప్రకటించింది. కొత్త ప్లాన్ కింద వినియోగదారులు రోజుకు రూ.10 ఖర్చుతోనే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను పొందనున్నారు. అనును ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్ గురించే. ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాలను గమనిస్తే ప్రతిరోజూ 2జీబీ డేటా, 100 ఉతిచ ఎస్ఎమ్ఎస్ లు, అపరిమిత కాలింగ్ సౌకర్యాలు 98 రోజుల వ్యాలిడిటీతో అందించబడుతున్నాయి.

5జీ హ్యాండ్ సెట్ వినియోగదారులు ప్లాన్ కింద అపరిమిత జియో 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవను పొందుతారని కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను ప్లాన్ అందిస్తోంది. జియో ప్రస్తుతం దేశంలో తన 5జీ సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువగా 4జీ హ్యాండ్ సెట్ వినియోగదారులు మార్కెట్లో ఉండటం కంపెనీ 5జీ ఆధరణను స్లో చేస్తోంది. దీనిని పరిష్కరించటానికి ఉచితంగా అన్ లిమిటెడ్ 5జీని ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. వెల్కమ్ ప్లాన్ పేరుతో దీనిని ప్రజలకు అందిస్తోంది.
ఇదే క్రమంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లను పరిశీలిస్తే దాదాపు 50 శాతం తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ అందిస్తున్న కొన్ని బెస్ట్ సరసమైన ప్లాన్ల ధరలను వాటి బెనిఫిట్స్ పరిశీలిస్తే..
* రూ.485 ప్లాన్.. డెయిలీ 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు- 82 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
* రూ.499 ప్లాన్.. డెయిలీ 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు- 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
* రూ.599 ప్లాన్.. డెయిలీ 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు- 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.
* రూ.769 ప్లాన్.. డెయిలీ 12 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎమ్ఎస్‌లు- 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications