For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేపటి నుంచే రిలయన్స్ జియో ప్లాన్ ధరలు పెంపు, ఈ స్కీంలు 25% చౌక!

|

డిసెంబర్ నెల నుంచి టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో గత నెలలో ప్రకటన చేశాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలో టారిఫ్స్ పెంచాయి. రిలయన్స్ జియో కూడా 39 శాతం పెంచింది. 6వ తేదీ (శుక్రవారం) నుంచి టారిఫ్స్ పెరగనున్నాయి. జియో కొత్త ఆల్ ఇన్ వన్ స్కీమ్స్‌ను ప్రకటించింది.

- ప్రతి రోజు 1.5GB డేటా, జియో ఫోన్ల మధ్య అపరిమిత ఫోన్ కాల్స్, ఇతర నెట్ వర్క్స్‌కు నెలకు 1,000 నిమిషాల చొప్పున కాల్స్ ఉంటాయి.
- రూ.199, కాలపరిమితి 28 రోజులు, 1,000 నిమిషాలు.
- రూ.399, కాల పరిమితి 56 రోజులు, 2,000 నిమిషాలు
- రూ.555, కాల పరిమితి 84 రోజులు, 3,000 నిమిషాలు
- రూ.2,199, కాల పరిమితి సంవత్సరం, 12,000 నిమిషాలు.

Reliance Jio new tariff plans unveiled: Here is how much you will have to pay from 6 December

- ఇతర చౌక ప్లాన్‌లలో రూ.129 రీఛార్జ్‌తో రోజుకు 2GB డేటా, జియో టు జియో ఉచితం, ఇతర నెట్ వర్క్స్‌కు 1,000 కాల్స్, కాల పరిమితి 28 రోజులు.
- రూ.329 రీఛార్జ్‌తో రోజుకు 6GB డేటా, జియో టు జియో ఉచితం, ఇతర నెట్ వర్క్స్‌కు 3,000 కాల్స్, కాల పరిమితి 84 రోజులు.
- రూ.1,299 రీఛార్జ్‌తో రోజుకు 24GB డేటా, జియో టు జియో ఉచితం, ఇతర నెట్ వర్క్స్‌కు 12,000 కాల్స్, కాల పరిమితి 365 రోజులు.

ఇతర నెట్ వర్క్స్ కొత్త ఛార్జీలతో పోలిస్తే తమ స్కీంలు 25 శాతం చౌకగా ఉన్నాయని రిలయన్స్ జియో తెలిపింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తన ప్లాన్ ఛార్జీలను ఈ నెల 3వ తేదీ నుంచి 50 శాతం వరకు పెంచాయి. ఈ రెండు కంపెనీలతో పోలిస్తే జియో ధరలు 20 శాతం వరకు చౌక ఉన్నాయి.

English summary

రేపటి నుంచే రిలయన్స్ జియో ప్లాన్ ధరలు పెంపు, ఈ స్కీంలు 25% చౌక! | Reliance Jio new tariff plans unveiled: Here is how much you will have to pay from 6 December

Reliance Jio Infocomm Ltd on Wednesday revealed the new tariffs of its ‘All in One’ plans with unlimited voice and data services. The new tariffs range from ₹199 a month to ₹2,199 for one year.
Story first published: Thursday, December 5, 2019, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X