ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీని ద్వారా భారత ప్రజలను ఆకర్షించడంలో విజయం సాధించింది. అలాగే ఇప్పుడు రిలయన్స్ జియో దీనికి అనుగుణంగా ఒక గొప్ప ఆఫర్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ.299కే 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా ప్లాన్ ప్రారంభించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలలో ఇది అత్యంత చౌకైన ప్లాన్. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioCloud యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
జియో రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ 5G డేటా ఉండదు. ఇటీవల రేట్లు పెరిగిన తర్వాత జియో, ఎయిర్‌టెల్ రెండూ 5G విధానాలను మార్చుకున్నాయి. ప్రస్తుతం, మీరు రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్ రీఛార్జ్ చేస్తేనే ఆన్ లిమిటెడ్ 5Gని ఉపయోగించగలరు. మీరు 1.5GB రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకుంటే, 5G కవరేజ్ ఉన్నప్పటికీ మీకు ఉచిత 5G డేటా లభించదు.

మీకు 28 రోజుల పాటు 42GB డేటా లభిస్తుంది. మీ దగ్గర 5G ఫోన్ లేకపోయినా 5G స్పీడ్ అవసరం లేకపోతే ఈ రూ. 299 ప్లాన్ మంచి అప్షన్. మీరు భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా ఆన్ లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు.
ఇంకా రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు JioTV, JioCinema, JioCloud యాప్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. రోజువారీ 1.5GB డేటా అలవెన్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. అయితే, మీరు WhatsApp మెసేజెస్ పంపడం లేదా పొందడం వంటి చిన్న పనులను చేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.
మీరు ఈ జియో ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి MyJio యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. కానీ మీరు Paytm, Google Pay, PhonePe వంటి ఇతర యాప్‌లను ఉపయోగిస్తే మీరు అదనపు చార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల రీఛార్జ్ రేట్ పెరిగే అవకాశం ఉంది.
ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
ఎంటర్టైన్మెంట్ ప్లాన్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇప్పుడు ఒక కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 949. ఈ ప్లాన్‌లో మూడు నెలల ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. దీనిలో టెలికాం ప్రయోజనాలతో పాటు స్ట్రీమింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఎక్కువగా చూసే వారికి ఇది చాలా బాగుంటుంది. దీనితో పాటు జియో రూ. 299 రీఛార్జ్ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చింది. గతంలో రీఛార్జ్ ధరలు పెరిగినప్పుడు ఈ ప్లాన్ తొలగించింది.జియో కస్టమర్లకు సరసమైన ధరలకు ఎక్కువ డేటాను అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications