Reliance Jio: భారతీయ టెలికాం రంగం రూపురేఖలు మార్చేసిన అంబానీ సరికొత్త సంచలనాలకు తెరలేపారు. తాజాగా ప్రత్యర్థి కంపెనీలను అతలాకుతలం చేసే మరో ప్లాన్ తో ముందుకొచ్చారు.ఎప్పుడైనా అంబానీ ప్లాన్ చేశారంటే మామూలుగా ఉండదు. ప్లాన్ పక్కాగా.. ఆయన అనుకున్న లెక్కలు తగ్గకుండా ముందుకు సాగుతారు.
తాజాగా జియో భారతదేశంలో జియో భారత్ పేరుతో 4G ఫోన్‌ను విడుదల చేసింది. '2G-ముక్త్ భారత్' విజన్‌ని వేగవంతం చేయటంలో భాగంగా కంపెనీ దీనిని విడుదల చేసింది. మెుబైల్ తయారీదారు కార్బన్ భాగస్వామ్యంతో రెండు జియో భారత్ ఫోన్ మోడల్‌లలో ఒకదాన్ని విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 10 లక్షల మెుబైల్ యూనిట్లను జూలై 7, 2023 నుంచి విక్రయించబడతాయని రిలయన్స్ ప్రకటించింది. వినియోగదారులు వీటిని సమీపంలోని రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ ఫీచర్ స్మార్ట్ 4G ఫోన్ అపరిమిత కాల్స్ చేయడానికి, ఫోటోలను క్లిక్ చేయడానికి, JioPayని ఉపయోగించి UPI చెల్లింపులను చేసేందుకు యూజర్లకు వీలు కల్పిస్తుంది. అలాగే జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
రిలయన్స్ జియో కొత్త ఫోన్ల కోసం ప్రత్యేకంగా జియో భారత్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. ఈ ప్లాన్స్ కేవలం రూ.123 నుంచి ప్రారంభం అవుతాయి. అలాగే ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి రూ.1,234 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని కింద రోజుకు అర జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందిస్తోంది. జియో బ్లాండింగ్ తో వచ్చే ఫోన్లకు పై ప్లాన్స్ వర్తిస్తాయి.

అలాగే భాగస్వామి మెుబైల్ మోడళ్లకు రూ.179, రూ.1799 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. డిజిటల్ యుగంలో ఇంకా 250 మిలియన్ల మంది ఇంకా 2జీ యుగంలోనే ఉన్నారని, ఇంటర్నెట్‌లోని ప్రాథమిక ఫీచర్లను ట్యాప్ చేయలేకపోతున్నారని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ జియో భారత్ ఫోన్‌ల విడుదలపై వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications