Jio AirFiber: తక్కువ రేటు.. ఎయిర్ ఫైబర్ లాంచ్ చేసిన జియో.. Airtel గుండెల్లో గుబులు..
Jio AirFiber: ముఖేష్ అంబానీ టెలికాం సంస్థ జియో తన నూతన ఉత్పత్తి ఎయిర్ ఫైబర్ ను ముందుగా ప్రకటించిన విధంగానే వినాయక చతుర్థి నాడు ప్రారంభించింది. అందరూ ఊహించిన దాని కంటే సరసమైన ధరలకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తొలుత దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలను జియో ప్రారంభించింది. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ దీనికి పోటీగా మార్కెట్లో ఉంది. దీని ప్రారంభ నెలవారీ ప్లాన్ రూ.599 నుంచి గరిష్ఠంగా రూ.3,999 వరకు జియో ప్రకటించింది. నేడు సేవలను జియో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో ప్రారంభించింది. కంపెనీ గృహ వినోదం, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సేవలను బండిల్ చేయాలని యోచిస్తోంది.

Jio AirFiber అనేది WiFi హాట్‌స్పాట్ లేదా రౌటర్ లాంటిది. అయితే ఇది ఫైబర్ ఆప్టిక్స్‌కు బదులుగా హై-స్పీడ్ 5G టెక్నాలజీని వినియోగిస్తుంది. ఈ నూతన సాంకేతికత కస్టమర్లకు పోర్టబిలిటీ సౌలభ్యాన్ని అందిస్తుంది. దీనిని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని ప్లగ్ ఇన్ చేసి సులభంగా వినియోగించుకోవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్ ద్వారా 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానళ్లు, వెనక్కి వెళ్లి షోలను చూసేందుకు క్యాచ్-అప్ టీవీ, 16 కంటే ఎక్కువ ఓటీటీ సేవలను ఉచింతగా పొందుతారు. టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్ వంటి వారికి నచ్చిన ఏదైనా పరికరంలో యాప్‌లను ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో ప్రతి మూలలో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications