Reliance Jio: ముఖేష్ అంబానీ సరికొత్త వ్యాపారం.. క్లౌడ్ ల్యాప్‌టాప్ లాంచ్ ప్లానింగ్..
Reliance Jio: మారుతున్న సాంకేతికతతో పాటు ప్రజల అవసరాలు మారుతున్నాయి. ఇవి కొత్త వ్యాపార అవకాశాలను కంపెనీలకు అందిస్తున్నాయి. ప్రజలు సైతం ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ పరిష్కారాల వైపు నడుస్తున్నారు.
రిలయన్స్ జియో ఒక క్లౌడ్ ఆధారిత ల్యాప్‌టాప్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని "డంబ్ టెర్మినల్" అని పిలుస్తారు. దీని ధర సుమారు రూ.15 వేలు ఉండనుంది. సాధారణంగా ఒక పర్సనల్ కంప్యూటర్ కొనటానికి ప్రస్తుతం రూ.50,000 ఖర్చవుతుంది. అందుకే హార్డ్ వేర్ అమ్మకాలతో పాటుగా.. దేశంలో వినియోగదారులకు నెలవారీ క్లాడ్ పర్సనల్ కంప్యూటర్లను సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపధికన అందించాలని జియో యోచిస్తోంది.

క్లౌడ్ ల్యాప్‌టాప్ మెమరీని, ప్రాసెసింగ్‌ను జియో క్లౌడ్‌కి మారుస్తుంది. దీని కారణంగా వినియోగదారులు వేగవంతమైన సేవలను పొందేందుకు వీలు కల్పించబడుతుంది. కొత్త కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కొనుగోలు చేయకూడదనుకునే వారు.. కంప్యూటింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి క్లౌడ్ PC సాఫ్ట్‌వేర్‌ను ఏదైనా డెస్క్‌టాప్ లేదా స్మార్ట్ టీవీలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. కేవలం జియో ఓఎస్ మాత్రమే కాక విండోస్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను దేశీయ మార్కెట్లలో తీసుకొచ్చేందుకు జియో ఇప్పటికే ప్రముఖ పీసీ తయారీ సంస్థలైన HP, Acer, Lenovoలతో కలిసి పనిచేస్తోందని సమాచారం. అలాగే HP Chromebooksతో ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హైబ్రిడ్ వర్క్ ట్రెండ్, రిమోట్ వర్క్ కోసం డేటా సురక్షితంగా నిర్వహించుకునేందుకు జియో తీసుకొస్తున్న కొత్త సాంకేతికత ఎక్కువగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. డిజిటల్ సేవల రంగంలో బలమైన ఉనికిని నెలకొల్పడానికి జియో విస్తృత లక్ష్యంతో భాగంగా తాజా వ్యూహాన్ని తీసుకొస్తోందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications