2025లో ఇన్వెస్టర్లకు ముఖేష్ అంబానీ గిఫ్ట్.. ఐపిఒలోకి రిలయన్స్ జియో గ్రాండ్ ఎంట్రీ..

బిలియనీర్, ఇండియాలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపిఒ ఎంట్రీకి సన్నాహాలు ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఐపిఒ ద్వారా 35,000 నుండి 40,000 కోట్ల రూపాయలను సమీకరించగలదని అంచనా.

చరిత్ర సృష్టించనున్న రిలయన్స్ జియో IPO
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPO భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద IPOగా నిరూపించనుంది, దీనిని ముఖేష్ అంబానీ 2025లో తీసుకురావచ్చు. ఈ IPO కేవలం ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ మాత్రమే కాదు, కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా కూడా ఫండ్స్ సమీకరించనుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ 2025 ద్వితీయార్ధంలో IPOని తీసురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. నివేదికల ప్రకారం ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి చర్చల దశ ప్రారంభమైంది. ప్రస్తుతం 2024 అక్టోబర్‌లో IPO ద్వారా రూ. 28000 కోట్లు సేకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరిట అతిపెద్ద IPO రికార్డు ఉంది.

Reliance Jio IPO Mukesh Ambani will give a gift to investors in 2025 IPO of Reliance Jio Infocomm will come

IPOలో పెట్టుబడిదారుల ఎగ్జిట్
రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇన్వెస్టర్లు ఐపిఓ నుండి ఎగ్జిట్ కావచ్చు కాబట్టి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఐపిఓలో ప్రైమరీ ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ ఉండవచ్చు. రిలయన్స్ జియోలో విదేశీ పెట్టుబడిదారులకు దాదాపు 33 శాతం వాటా ఉంది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్ పెట్టుబడిదాలు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, KKR అండ్ సిల్వర్ లేక్ వంటివి కంపెనీలో సుమారు $18 బిలియన్ల పెట్టుబడి పెట్టాయి.

Jio లిస్టింగ్ పట్ల Jefferies-CLSA నమ్మకం
గ్లోబల్ బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్ రీసర్చ్ రిపోర్టులో 2025 సంవత్సరంలో రిలయన్స్ జియోకి లిస్టింగ్ చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరో విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA కూడా 2025 రెండవ లేదా మూడవ త్రైమాసికంలో Reliance Jio IPOని ప్రారంభించే ఛాన్స్ ఉందని వ్యక్తం చేసింది. CLSA అండ్ Jefferies కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ టార్గెట్ ధరను వాల్యూ అన్‌లాకింగ్ అండ్ న్యూ ఎనర్జీ బిజినెస్ ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలాగే పెద్దగా ఉండే అవకాశాన్ని పెంచాయి. CLSA రిలయన్స్ స్టాక్‌కు రూ. 2186 టార్గెట్ ఇచ్చింది, ఇది ప్రస్తుత స్థాయి కంటే 78 శాతం ఎక్కువ. 1700 టార్గెట్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయాలని జెఫరీస్ సూచించింది. ప్రస్తుతం రిలయన్స్ స్టాక్ రూ.1226 వద్ద ట్రేడవుతోంది.

2019లో లిస్టింగ్ అయ్యే సూచనలు
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయితే, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన రిలయన్స్ గ్రూప్ మూడవ కంపెనీ అవుతుంది. 2019 సంవత్సరంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్‌లను వచ్చే ఐదేళ్లలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+