Jio Cricket Plans: క్రికెట్ ఫ్యాన్స్‌కు జియో 'ఐపీఎల్' గుడ్‌న్యూస్
క్రికెట్ అభిమానులకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. రిలయన్స్ జియో త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో వివిధ రకాల టారిఫ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఐపీఎల్ నేపథ్యంలో ఎక్కువగా 4G డేటాతో పాటు వాయిస్, టెక్స్ట్ బెనిఫిట్స్ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీంతో జియో కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లో చూసి ఆనందించవచ్చు. డేటా ప్లాన్స్‌తో పాటు యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. డేటా, వాయిస్, 1 ఇయర్ డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ రూ.399కి అందిస్తోంది.
ప్లాన్స్ వివరాలు...

- రూ.401 ప్లాన్- ప్లాన్ ప్రయోజనాలు.. రోజుకు 3GB డేటా. అపరిమిత వాయిక్ కాల్స్. ఏడాది పాటు డిస్నీ +హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.
- రూ.598 ప్లాన్ - ప్లాన్ ప్రయోజనాలు.. రోజుకు 2GB డేటా. అపరిమిత వాయిక్ కాల్స్. ఏడాది పాటు డిస్నీ +హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ కాలపరిమితి 56 రోజులు.
- రూ.777 ప్లాన్ - ప్లాన్ ప్రయోజనాలు.. రోజుకు 1.5GB డేటా. అపరిమిత వాయిక్ కాల్స్. ఏడాది పాటు డిస్నీ +హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.
- రూ.2,599 ప్లాన్ - ప్లాన్ ప్రయోజనాలు.. రోజుకు 2GB డేటా. అపరిమిత వాయిక్ కాల్స్. ఏడాది పాటు డిస్నీ +హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు.
- రూ.499 డేటా యాడ్ ఆన్- రోజుకు 1.5GB డేటా. అపరిమిత వాయిక్ కాల్స్. ఏడాది పాటు రూ.399 విలువైన డిస్నీ +హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రూ.499 యాడ్ ఆన్ వ్యాలిడిటీ 56 రోజులు.


Click it and Unblock the Notifications