ఐపీఎల్ సీజన్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. క్రికెట్ ప్రేమికుల కోసం జియో అదనపు డేటా వంటి ఆఫర్లు ప్రకటించింది. తాజాగా రిలయన్స్ జియో నెట్ వర్క్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఐపీఎల్ అభిమానుల కోసం కొత్త ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ అనే సరికొత్త బహుమతులు గెలుచుకునే ఆఫర్‌ను తీసుకు వచ్చింది. దీని ద్వారా ఎన్నో బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ గేమ్‌లో పాల్గొనేవారికి నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్ ఉంటాయి. మీ ఫేవరేట్ టీమ్‌కు స్టిక్కర్ చాట్, స్కోర్స్, మ్యాచ్,షెడ్యూల్, ఫలితాలు యాక్సెస్ చేసుకోవచ్చు.

ప్రశ్నలు.. బహుమతులు
జియో క్రికెట్ ప్లే ఎలాంగ్ ప్లాట్‌ఫాం ద్వారా మ్యాచ్ జరిగే సమయంలో క్విజ్ ఉంటుంది. సరైన సమాధానం చెబితే గిఫ్ట్స్ ఉంటాయి. వినియోగదారుడు తన క్రికెట్ స్కిల్స్‌ను ఉపయోగించి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వీటిని పొందవచ్చు. మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ క్వశ్చన్, పోల్స్, క్విజ్ ఉంటుంది. ఆ రోజుకు మ్యాచ్‌కు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కొన్ని ఊహాజనిత ప్రశ్నలు ఉంటాయి. ఎవరు గెలుస్తారు, ఆటగాడు అర్ధ సెంచరీ చేస్తాడా, సెంచరీ చేస్తాడా వంటి ప్రశ్నలు ఉంటాయి. డైలీ రివార్డ్స్ ద్వారా డైలీ ఛాలెంజెస్‌ను పూర్తి చేయడం ద్వారా బహుమతులు పొందవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు టాస్క్‌లో గెలిచిన వారికి అందించే బంపర్ ప్రైజ్ ఉంటుంది. ఇందులో పాల్గొనేందుకు దీనిపై క్లిక్ చేసి, వివిధ బహుమతులు గెలుచుకోవచ్చు.

జియో.. జియోయేతర కస్టమర్లు
మ్యాచ్ జరిగే సమయంలో లైవ్ చాట్ ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా స్టిక్కర్స్ పంపుతూ మీ అభిమాన జట్టును ప్రోత్సహించవచ్చు. అక్కడ లైవ్ స్కోర్, మ్యాచ్ షెడ్యూల్, ఫలితాలు వంటివి అందుబాటులో ఉంటాయి. కాగా, ఈ ఆఫర్లు మైజియో యాప్‌లోని జియో ఎంగేజ్ సెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో మరో ఆసక్తికర విషయం ఏమంటే జియోతో పాటు జియోయేతర వినియోగదారులు కూడా దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

క్రికెట్ ప్లాన్ తెచ్చిన వారానికే..
జియో క్రికెట్ ప్లాన్‌ను ప్రారంభించిన వారం రోజులకే ఈ సరికొత్త ఆఫర్ తీసుకు రావడం గమనార్హం. ఇంట్లో ఉంటూనే జియో క్రికెట్ ప్లే ఎలాంగ్‌ను ఎంజాయ్ చేస్తూ మంచి బహుమతులు గెలుచుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications