Jio News: జియో కస్టమర్లకు ముఖేష్ అంబానీ గిఫ్ట్.. ఈ జంబో ప్లాన్‌తో భారీ బెనిఫిట్స్
Jio Recharge Plans: రిలయన్స్ జియో ఎంట్రీతో భారత టెలికాం రంగం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ ను అందించడంలో అంబానీ సంస్థ కీలక పాత్ర పోషించింది. మొదట ఏడాది పాటు ఉచితంగా డేటా ఇచ్చి పెద్ద సంఖ్యలో యూజర్లను ఆకర్షించింది. తదనంతర కాలంలోనూ OTT సహా కాలర్ ట్యూన్స్, కాల్స్, మెసేజ్ లు వంటి తాయిలాలు ప్రకటించి మార్కెట్లో నెంబర్ వన్ పొజిషన్ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల దాదాపు అన్ని టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచిన తర్వాత జియోతో పాటు ఇతర ప్లేయర్ల కస్టమర్లు కూడా BSNL వైపు చూస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సదరు సంస్థలు తల పట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో జియో ఒక కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది. ఒకేసారి ఏడాదిపాటు రీఛార్జ్ చేసే ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులకు, దీర్ఘకాలిక సౌలభ్యం కోరుకునే వారికి అనువుగా 365 రోజుల సింగిల్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

ఏడాది పొడవునా నిరంతరాయంగా సేవలందుకునే ఈ ప్లాన్ ధర 3 వేల 599గా నిర్ణయించింది. దీనితో ప్రతిరోజూ 2.5 GB డేటాను ఆస్వాదించవచ్చు. అంటే సంవత్సరం మొత్తం మీద 912.5 GB డేటా అందించేందుకు జియో ముందుకు వచ్చింది. వీటికితోడు అదనపు పెర్క్‌లను యాడ్ చేసి ఈ ప్లాన్ ని ఆకర్షణీయంగా తయారు చేసింది. 5G హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనాలతో పాటు రోజువారీ 100 SMSలు వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది.
వీటన్నిటికి అదనంగా జియో TV, జియో సినిమా, జియో క్లౌడ్ సహా మొత్తం జియో డిజిటల్ సేవల సూట్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఈ ప్లాన్ తో లభిస్తోంది. దీంతో ప్రతినెల రీఛార్జ్ చేయించుకునేందుకు విసుగుచెందే యూజర్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా నిలిస్తోంది. ఇతర టెలికాం సంస్థలు సహా BSNL దూకుడుకు ఈ ప్లాన్ తో అడ్డుకట్ట వేయాలని జియో భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications