Reliance Jio: దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సేవల్లో అందరాయం ఏర్పడింది. యూజర్లు తమకు ఇష్టమైన వాట్సాప్ నుంచి యూట్యూబ్, గూగుల్ వంటి అన్ని సేవలను అందుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కంపెనీ సేవలపై వరుస ఫిర్యాదులతో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.
టెలికాం జెయింట్ ఫిర్యాదుదారులలో 54 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొంటుండగా.. 38 శాతం మంది జియో ఫైబర్, 7 శాతం మంది మొబైల్ నెట్‌వర్క్ అంతరాయాలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అయితే ఈ ఫిర్యాదులపై కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు లేదా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే కస్టమర్ కేర్ సైతం తమకు సరైన సమాధానం అందించటంలో విఫలమైందంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక యూజర్ ట్విట్టర్లో స్పందిస్తూ జియో సంస్థ ఎయిర్ టెల్ సంస్థ నుంచి హాట్ స్పాట్ అడిగి తీసుకోవాలంటూ వెక్కిరిస్తూ ఒక పోస్ట్ రాశారు. అలాగే మరికొందరు తమ చేదు అనుభవాలను నేరుగా సోషల్ మీడియా ద్వారా కంపెనీ హాండిల్స్ టాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం గడచిన 24 గంటలుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
కొన్ని రోజుల ముందర జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ UPI, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి Jio ఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్‌ను ప్రారంభించింది. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్ సెటిల్మెంట్, ఇన్సూరెన్స్ సలహాలను ఏకీకృతం చేయడం ఈ యాప్ లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ఫైనాన్షియల్ టెక్నాలజీతో పరిచయం ఉన్న అన్ని స్థాయిల వినియోగదారులను అందిస్తుంది. అవాంతరాలు లేని మనీ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. జియోఫైనాన్స్ విశ్వసనీయత, ఔచిత్యం మరియు పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తుందని కంపెనీ పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications