టెలికాం రంగంలో జియో తన దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సబ్‌స్క్రైబర్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఉన్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ జియోకు నవంబర్‌లో 34.47 లక్షల నెట్ వైర్‌లెస్ చందాదారులు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 39.94 లక్షల మందికి చేరింది.
18.5 లక్షల మందితో భారతి ఎయిర్‌టెల్ రెండవ స్థానంలో ఉంది. గత నెల కంటే స్వల్పంగా పెరిగింది. నవంబర్‌లో సునీల్ భారతి మిట్టల్ మద్దతుగల కంపెనీ ఎయిర్ టెల్ కు గతంలో 17.47 లక్షల మంది చందదారులు ఉన్నారు. మరోవైపు వోడాఫోన్ ఐడియా నవంబర్‌లో 10.73 లక్షల మంది వినియోగదారులను కోల్పోగా, తాజాగా 13.68 లక్షల వైర్‌లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది.

TRAI డేటా ప్రకారం నవంబర్ నుంచి డిసెంబర్ చివరి వరకు కలిపి మొబైల్ కనెక్షన్లు 35.78% పెరిగి 43.22 లక్షలకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన నష్టాల పరంపరను నెమ్మదిగానే కొనసాగించింది. టెలికాం డిసెంబర్‌లో 1.5 లక్షల వైర్‌లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇది గత నెల కంటే దాదాపు 84 శాతం తక్కువ.
యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లలో భారతి ఎయిర్‌టెల్ 98.9% పైగా యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జియో క్రియాశీల సబ్‌స్క్రైబర్లు డిసెంబరులో 92.32%కి పడిపోయారు. అంతకుముందు నెలలో 93.87 శాతంగా ఉన్నారు. డిసెంబర్‌లో 1.24 కోట్ల మంది చందాదారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం తమ అభ్యర్థనలను సమర్పించారు. దీనితో, క్యుములేటివ్ MNP అభ్యర్థనలు నవంబర్ చివరి నాటికి 91.47 కోట్ల నుండి డిసెంబర్ చివరి నాటికి 92.71 కోట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications