Reliance Jio: అంబానీకి ఊహించని ఎదురుదెబ్బ.. జియో కోట కూలిపోతోందా..?
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత తమ్ముడు పతనం తర్వాత టెలికాం రంగంలో జియో వెంచర్ తో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కోట్ల మంది యూజర్లను ఉచితాలను ఆకట్టుకున్న అంబానీ ప్రస్తుతం పెద్ద దెబ్బ ఎదుర్కొంటున్నారు. ఇతరుల వ్యాపారాలను ఆఫర్లతో పడగొట్టి కట్టిన జియో కోట ప్రస్తుతం బీటలు వారుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అనంత్ అంబానీ పెళ్లి తర్వాత అంబానీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
చిన్న కుమారుడు అనంత్ వివాహం తర్వాత రిలయన్స్ జియో తన టారిఫ్ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద బ్యాక్ ఫైర్ ను చూసింది. జియో పెంపుతో ఇతర ప్రైవేటు ఆపరేటర్లు సైతం తమ ఛార్జీల మోత మోగించాయి. దీంతో యూజర్లు దీనిని నిరసిస్తూ జియో నుంచి బీఎస్ఎన్ఎల్ కి తిరిగి రావాలంటూ పెద్ద ట్రోలింగ్ కూడా జరిగింది. తక్కువ ఖర్చుకే ప్రభుత్వ సంస్థ సేవలను అందించటంతో జియో యూజర్లు ఒక్కసారిగా జంప్ కొట్టడం ప్రారంభించారు. టారిఫ్ రేట్ల పెంపు తర్వాత ఆ ప్రభావం యూజర్ బేస్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో దాదాపు 10,900,000 మంది వినియోగదారులు జియోను వదిలి వెళ్లిపోయారు.

ఇంత భారీ స్థాయిలో యూజర్లు జియోను విడిచిపెట్టడం అనేది నిజానికి కంపెనీకి ఆందోళనకలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించటానికి జియో ప్రయత్నాలు ప్రారంభిస్తోందని తెలుస్తోంది. అయితే ఒక కంపెనీ టారిఫ్‌లలో కొన్ని మార్పులను తీసుకువచ్చినప్పుడల్లా వినియోగదారులు తమ లాయల్టీని మార్చుకోవడం ఒక సాధారణ ధోరణిగా గమనించబడింది. ప్రస్తుతం తన 5జీ సేవలను ఇతర ఆపరేటర్ల కంటే వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించిన వేళ యూజర్ బేస్ గతంలో ఉన్న 1.30 కోట్ల నుంచి 17 లక్షలు పెరిగి 1.47 కోట్లకు చేరుకున్నారని కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం గతంలో ఉన్న రూ.181.7 నుంచి ప్రస్తుతం రూ.195.1కి పెరగగా, మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.
జియో తన యూజర్ బేస్‌కు సంబంధించి పరిస్థితి గురించి కంపెనీకి తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి అని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం తగ్గనున్న ఉద్యోగుల సంఖ్య మార్కెట్లోని ఇతర ఆపరేటర్లకు ఖచ్చితంగా అవకాశాన్ని కల్పిస్తుందని జియో వెల్లడించింది. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీ తాను కోల్పోయిన యూజర్లను తిరిగి పొందటానికి కొత్త ఆఫర్లను లేదా తగ్గింపులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications