Jio 5G: అంబానీ దూకుడికి స్పీడు బ్రేకులు.. 5జీ యూటర్న్ టూ 4జీ, ఎందుకిలా..?
Jio 5G Expansion: భారతదేశంలో టెలికాం కంపెనీలు తమ వ్యాపారాలను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలకు ఊహించిన స్థాయిలో ఫలితాలు కనిపించటం లేదని తెలుస్తోంది. దీంతో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో తన ప్లాన్ మార్చింది.
అవును దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తమ 5G నెట్‌వర్క్ విస్తరణను ప్రస్తుతం నెమ్మదింపజేశాయి. రానున్న కాలంలో అందరూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం 5జీకి మారతారని, 4జీ నుంచి క్రమంగా అప్ గ్రేడ్ అవుతారని సదరు కంపెనీలు భావించి తమ 5జీ సేవల విస్తరణపై భారీగా డబ్బు వెచ్చించాయి. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా కొనసాగుతున్న వేళ సదరు కంపెనీ మళ్లీ 4G సేవ విస్తరణ,ప్రణాళికలను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాయి.

ప్రజల నుంచి 5జీ సేవలకు అంగీకారం రావాలంటే ప్రస్తుతం వారు వినియోగిస్తున్న 4జీ మెుబైల్ ఫోన్స్ చేంజ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో 100 కోట్లకు పైగా ప్రజలు ఉన్న దేశంలో ఈ మార్పు అకస్మాత్తుగా అస్సలు కుదరని పని. వాస్తవానికి దేశంలో 5G టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయటానికి టెలికాం సంస్థలు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ.. 5G సేవ వినియోగదారుల సంఖ్య, స్కేల్ తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో కంపెనీలు ఆదాయాలను మెరుగుపరుచుకునేందుకు తిరిగి 4జీ సేవలను మెరుగుపరచటంపై దృష్టి సారిస్తున్నాయని తెలుస్తోంది. అయితే మరో పక్క వొడఫోన్ ఐడియా సంస్థ మాత్రం ఒక అడుగు ముందుగానే ఆలోచించి 5జీ కంటే 4జీ సేవలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
టెలికాం మార్కెట్ లీడర్ అయిన జియో ప్రస్తుతం 5G నెట్‌వర్క్ వినియోగాన్ని కేవలం 15% మాత్రమే కలిగి ఉంది. అయితే కంపెనీ మాత్రం 30 శాతం వినియోగంలో ఉన్నట్లు చెబుతోంది. నోకియా, ఎరిక్సన్ Jioకి 5G పరికరాల ప్రాధమిక సరఫరాదారులుగా ఉన్నారు. కానీ కంపెనీ కొత్త ప్లాన్ వల్ల సరఫరాను కూడా తగ్గాయి. జియో దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని 90 శాతం కంటే ఎక్కువగా పూర్తి చేసింది. కానీ వినియోగం అంత వేగంగా వృద్ధిని సాధించలేకపోయింది. మెుదటి త్రైమాసికంలో జియో 4.9 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. ఇందులో 1.3 కోట్ల మంది మాత్రమే 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ జియో ఫైబర్, 5జీ ఆధారిత Pixet వైర్‌లెస్ సేవ దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి.


Click it and Unblock the Notifications