Reliance Jio: ముఖేష్ అంబానీకి ఎదురుదెబ్బ.. BSNL గట్టిపోటీ ఇస్తోందా..!!
Jio Boycott: ఇటీవల భారతీయ టెలికాం రంగంలో దిగ్గజంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో తన టారిఫ్ రెట్లను పెంపును ప్రకటించింది. దీని తర్వాత ఇతర సంస్థలైన ఎయిర్ టెల్, వోడఫోన్ ఐడియాలు ఇదే దారిలో పెంపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సెల్‌ఫోన్ వినియోగదారులపై భారం అధికమైంది.
ఈ పెంపులకు నిరసనగా అనేక మంది వినియోగదారులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. రేట్లను అకస్మాత్తుగా పెంచటంపై జియో యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు JioBoycott అనే హ్యాష్ ట్యాగ్ అంటూ 40,000 మంది ట్విట్టర్లో పోస్టులు చేశారు. దీంతో బాయ్‌కాట్ జియో అనేక ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో దేశంలోని మూడు అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచటంతో చాలా మంది ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవ్వాలని చూస్తున్నారు.

వాస్తవానికి బీఎస్ఎన్ఎల్ మార్కెట్లోని ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలకే మెరుగైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. ఈ రేట్ల పెంపు క్రమంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలు ప్రస్తుతం తక్కువ ధర ప్లాన్లపై అందిస్తున్న అన్ లిమిటెడ్ 5జీ సదుపాయాన్ని సైతం వినియోగదారులకు దూరం చేశాయి. ఈ క్రమంలో వినియోగదారులకు కొంత ఉపశమనం అందించేందుకు జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరోపక్క ఇదే క్రమంలో నెటిజన్లు BSNLkigharwapsi అనే హ్యాట్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీనిని ఉపయోగించి దాదాపు 45,000 పోస్టులు సామాజిక మాద్యమంలో ట్రెండ్ అయ్యాయి. చాలా మంది మధ్యతరగతి భారతీయులు టెలికాం కంపెనీలు పెంచిన టారిఫ్ల భారాన్ని మోయలేమంటూ తిరిగి బిఎస్ఎన్ఎల్ కి మారాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 30 రోజుల వ్యవధిలో రోజుకు 2GB డేటాను అందించే BSNL ప్లాన్ ధర రూ.199 ఉండగా.. ఇదే ప్లాన్ ధర ఎయిర్‌టెల్ నెలకు రోజుకు 2GB డేటా కోసం రూ.379, రిలయన్స్ జియో 28 రోజుల చెల్లుబాటు కోసం రూ.349 వసూలు చేస్తున్నాయి. టెలికాం కంపెనీలు వార్షిక ప్యాకేజీల ధరలు సగటున రూ.600 మేర పెంచాయి.


Click it and Unblock the Notifications