Ambani news: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అడుగుపెట్టిన ప్రతి వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా 'జియో సినిమా'ను తీర్చిదిద్దాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రత్యర్థి కంపెనీలు నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ వంటి వాటికి పోటీగా నిలిపేందుకు సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.
రిలయన్స్ తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమాలో పిల్లల కోసం వినోద కంటెంట్‌ను పెంచడానికి చర్యలు చేపట్టింది. ఇందుకుగాను పోకీమాన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ప్రత్యర్థి సంస్థలకు ధీటుగా తన ప్లాట్ ఫారమ్ లో కంటెంట్ ను పెంచేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

దాని ప్రకారం.. జియో సినిమా యాప్‌ను వెయ్యి కంటే ఎక్కువ ఎపిసోడ్‌లతో, దాదాపు 20 జపనీస్ యానిమేషన్ సిరీస్‌లతో ప్రత్యేక భాగస్వామిగా చేస్తూ ఈ నెలలో ఒప్పందం కుదిరింది. ప్రాంతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిరీస్ లు, సినిమాలను 3 ప్రముఖ భారతీయ భాషల్లోకి డబ్ చేయాలని అంబానీ కంపెనీ భావిస్తోంది.

పోకీమాన్ అనేది మల్టీ-బిలియన్ డాలర్ల మీడియా ఫ్రాంచైజ్. ట్రేడింగ్ కార్డ్‌లు, గేమ్‌లు, టీవీ షోలు సహా సినిమా వ్యాపారాలను కలిగి ఉంది. ఇరు కంపెనీల మధ్య జరిగిన ఈ డీల్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించబడలేదు. దీనికితోడు ఎంటర్‌టైన్‌మెంట్ వన్, యానిమాకార్డ్, కార్టూన్ నెట్‌వర్క్ స్టూడియోస్, డ్రీమ్‌వర్క్‌ల నుంచి 3 వేల గంటల చలనచిత్రాలు, షోలతో కూడిన పిల్లల కంటెంట్ జియో సినిమాలో త్వరలోనే యాడ్ కానున్నట్లు నివేదిక పేర్కొంది.


Click it and Unblock the Notifications