రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ దుమ్మురేపింది. గ్రూపులోని రిటైల్, టెలికాం విభాగాలు రాణించడంతో తృతీయ త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. అటు పెట్రో రసాయనాల విభాగం నుంచి నష్టాలు ఎదురైనా.. ఇటు చమురు రిఫైనింగ్ వ్యాపారంలో కలిసి రావడంతో రికార్డు స్థాయిలో నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.10,251 కోట్లుగా నమోదుకాగా ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో రూ.11,640 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో.. ఈ సంస్థ నికర లాభం గత ఏడాదికంటే 13.5 శాతం పెరిగినట్లయింది. ప్రైవేటు కంపెనీల్లో ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయి లాభాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.

తన రికార్డులు తానే తిరగరాసి...
ప్రైవేటు రంగంలో ఇప్పటి వరకు ఏదైనా త్రైమాసికంలో అత్యధిక నికర లాభం నమోదు చేసిందా అంటే.. అది ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రమే. ఈ కంపెనీ గత ఏడాది రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. అయితే తాజాగా రిలయన్స్ తన రికార్డును తానే తిరగరాసింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఈ కంపెనీ రూ.11,640 కోట్ల నికర లాభాన్ని సాధించింది.

పెట్రో రసాయనాలు డీలా పడినా...
ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ గ్రూపు వ్యాపారాల్లో పెట్రో రసాయనాల వ్యాపారం మాత్రం కాస్త డీలా పడిందనే చెప్పాలి. 9.9 మిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి జరిగినప్పటికీ.. పెట్రో రసాయనాల ధరలు తగ్గడంతో ఈ విభాగం ఆదాయం రూ.5,880 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే చమురు రిఫైనింగ్ వ్యాపారం మాత్రం పర్వాలేదనిపించింది. ఈ వ్యాపారం 12 శాతం పెరగడంతో ఈ విభాగం ఆదాయం రూ.5,657 కోట్లకు చేరింది.

మోత మోగించిన రిటైల్, టెలికాం...
రిలయన్స్ గ్రూపులోని రిటైల్, టెలికాం విభాగాలలో వృద్ధి బాగా కనిపిస్తోంది. పన్నుకు ముందు లాభం విషయంలోనూ ఈ రెండు విభాగాలు రికార్డు సృష్టించాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరి నాటికి 10,901 రిలయన్స్ రిటైల్ స్టోర్లు ఉండగా.. మూడో త్రైమాసికం నాటికి వీటి సంఖ్య 11,316కు చేరింది. ఫలితంగా రిటైల్ ఆదాయం 27 శాతం వృద్ధి చెంది రూ.45,327 కోట్లకు చేరింది. మరోవైపు రిలయన్స్ జియో స్టాండలోన్ లాభం ఏకంగా 62.5 శాతం వృద్ధి చెంది రూ.1,350 కోట్లకు చేరుకోగా.. ఆదాయం కూడా 28.3 శాతం పెరిగి రూ.13,968 కోట్లకు చేరింది. సబ్ స్క్రైబర్ల సంఖ్య 37 కోట్లకు పెరగడంతో వాయిస్ కాలింగ్ 30 శాతం, డేటా వినియోగం 40 శాతం వృద్ధి చెందడం ఇందుకు కారణం.

పెరిగిన అప్పులు, నగదు...
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆదాయం మాత్రం కొద్దిగా తగ్గింది. గడిచిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 1.4 శాతం మేర తగ్గి రూ.1,68,858 కోట్లుగా నమోదు అయింది. మరోవైపు ఈ సంస్థ అప్పులు, నగదు నిల్వలు కూడా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరు చివరి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు మొత్తం రూ.2,91,982 కోట్లుగా ఉండగా.. అవి డిసెంబర్ 31 నాటికి రూ.3,06,851 కోట్లకు చేరాయి. అలాగే కంపెనీ నగదు నిల్వలు కూడా రూ.1,34,746 కోట్ల నుంచి రూ.1,53,719 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications