రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ రూ.43,574 కోట్ల మొత్తంతో 9.99% వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పరస్పర ప్రయోజనంతో ఈ ఒప్పందం కుదిరింది. లాక్ డౌన్ సమయంలో ఇది అతి పెద్ద కార్పోరేట్ డీల్. అయితే ఇది ఎక్స్‌కుల్జీవ్ డీల్ కాదని రెండు కంపెనీలు వెల్లడించాయి. ఏదేమైనా ఈ డీల్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. కొన్ని అంశాల్లో ఈ రెండు కంపెనీల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి.

జియో ఇలా, ఫేస్‌బుక్ అలా
ఓవర్ ది టాప్(OTT) ప్లాట్‌పామ్స్ పూర్తి డేటా యాక్సెస్ ఇక్కడివారికే ఉండాలని, ఎంఎన్ఎసీలకు కాదని జియో గత ఏడాది ట్రాయ్‌కు తెలిపింది. ఇండియన్ గవర్నమెంట్‌తో డేటాను పంచుకోవాల్సిన అవసరం లేదని ఫేస్‌బుక్ గత ఏడాది అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ రెండు కంపెనీలు కూడా తమ తమ వైఖరిని మార్చుకునే అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు. అయితే ఈ రెండు సంస్థలు కూడా డేటా, ఎన్‌క్రిప్షన్‌కు సంబంధించి కలిసి పని చేయనున్నాయి.

జియో-ఫేస్‌బుక్ స్వతంత్ర సంస్థలు..
జియో - ఫేస్‌బుక్ డీల్‌కు ముందే వివిధ అంశాలపై ఇరు కంపెనీలు చర్చించుకున్నాయని అంటున్నారు. పై అంశాలు వేరని, ఒప్పందం పూర్తిగా వాణిజ్యపరమైనదని చెబుతున్నారు. ఒప్పందాన్ని రూపొందించే విధానంలో ఎలాంటి విబేధం, వివాదం లేదని అంటున్నారు. ఫేస్‌బుక్, జియో స్వతంత్ర సంస్థలు అని, ఈ రెండు సంస్థలు కలిసి పని చేసే పరిధి ఉన్నట్లే, ఒప్పందంలో లేకుండా విభేదించే అంశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కూడా తమ వినియోగదారుల డేటా గురించి అవగాహన కలిగి ఉన్నాయని, కస్టమర్ డేటాను గౌరవిస్తామని చెబుతున్నారు.

స్వతంత్ర ఆలోచనలు
ఇండియాలోని లక్షలాదిమంది సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు కొత్త అవకాశాలను కల్పించడం కోసమే జియో ప్లాట్‌పాంతో ఒప్పందమని ఫేస్‌బుక్ తెలిపింది. వివిధ అంశాలపై జియో-ఫేస్‌బుక్ స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ ఒప్పందం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి వెళ్తుందని వెల్లడించింది. విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పర ప్రయోజనంతో వాటిని అధిగమిస్తాయని అంటున్నారు.

ముఖేష్-జుకర్ బర్గ్ ఎవరి ఆలోచన వారిది.. ఎలా అధిగమిస్తారో..
కేవలం ఇండియా కోసమే జియో కోసమే ఫేస్‌బుక్ తన విధానాలను మార్చుకునే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది గ్లోబల్ కంపెనీ అని గుర్తు చేస్తున్నారు. దీని ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైనవని అంటున్నారు. డేటా స్థానికీకరణపై ముఖేష్ అంబానికి కూడా స్పష్టమైన, బలమైన అభిప్రాయం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలను ఎలా అధిగమిస్తారో చూడాలని అంటున్నారు.

ఫేస్‌బుక్ పెట్టుబడి కంటే జియో వ్యాపార ఆసక్తి బలమైనది
డేటా స్థానికీకరణ వంటి అంశాలపై ఫేస్‌బుక్ తన అభిప్రాయాలు మార్చుకునే అవకాశం లేదని, అలా జరిగితే ఇతర దేశాలలోను ఈ దిగ్గజ సంస్థపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే జియో కూడా డేటా స్థానికీకరణకు కట్టుబడి ఉండే అవకాశాలే ఉంటాయని చెబుతున్నారు. డేటా లోకలైజేషన్‌కు తాము కట్టుబడి ఉన్నామని, డేటా ఎక్కడైతే ఉత్పత్తి అయిందో ఆ దేశంలోనే ఉండే ఏ పరికరంలోనైనా డేటాను నిల్వచేసి ఉంచడాన్ని డేటా లోకలైజేషన్ అంటారు. దీనికి జియో కట్టుబడి ఉండవచ్చు. ఫేస్‌బుక్ పెట్టుబడి కంటే జియో వ్యాపార ఆసక్తి చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ఈ రెండు కంపెనీల ఒప్పందాల్లో ఈ అంశాలు ఏ మేరకు ప్రాధాన్యత కలిగి ఉంటాయి, ఎలా అధిగమిస్తాయనేది ఆసక్తికరం అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications