Jio Vs Airtel: ఇప్పటి వరకు టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, జియోలు దేశంలో అగ్రగామి ఆపరేటర్లుగా యూజర్ల కోసం యుద్ధం చేశాయి. అయితే ఇకపై ఇది తారా స్థాయికి చేరుకోనుందని తెలుస్తోంది. ఇక యుద్ధం అంతరీక్షం కేంద్రంగా జరగనుందని వెల్లడైంది.
ఇటీవల ప్రధాని హాజరైన ఇండియన్ మెుబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో రిలయన్స్ జియో తన సరికొత్త జియో స్పేస్ ఫైజర్ సేవలను ప్రదర్శించింది. ప్రస్తుతం దేశంలో శాటిలైట్ ఆథారిత మెుబైల్ సేవలను అందించేందుకు ఈ టెక్నాలజీ దోహదపడనుంది. అయితే అంబానీకి పోటీగా సునీల్ మిట్టల్ ఎయిర్ టెల్ సైతం తన వన్‌వెబ్ శాటిలైట్ ఆథారిత టెలికాం సేవలను అందించేందుకు గతంలోనే వ్యూహాలను రచించి పెట్టుకుంది.

తాజాగా ఈ రెండు కంపెనీలు తమ కమర్షియల్ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అవసరమైన అనుమతులను పొందాయని వెల్లడైంది. అయితే ఇదే వ్యాపారంలోకి విదేశీ సంస్థలైన అమెజాన్, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ అరంగేట్రం చేసేందుకు లైసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాయి. ఇప్పటికే జియో-ఎయిర్ టెల్ కంపెనీలు GMPCS(గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్) లైసెన్స్‌తో పాటు పాన్-ఇండియా ISP(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లైసెన్స్‌ను కలిగి ఉన్నాయి.
జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్ టెల్ యూటెల్‌శాట్ వన్‌వెబ్‌లు దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన మొదటి కంపెనీలుగా కొత్త చరిత్ర సృష్టించనున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు సాధారణ మెుబైల్ వినియోగదారులపై మెుదటగా దృష్టి పెట్టాలని అనుకోవటం లేదని తెలుస్తోంది. ముందుగా తమ శాటిలైట్ ఆథారిత ఇంటర్నెట్ సేవలను ఎంటర్‌ప్రైజెస్ కస్టమర్లకు అందించాలని చూస్తున్నట్లు సమాచారం. యూఎస్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ త్వరలో భారతదేశంలో లైసెన్స్‌ని పొందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ఈ నూతన సాంకేతికత మెుబైల్ వ్యాపార స్వరూపాన్ని పూర్తిగా మార్చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటి భవితవ్యం పూర్తిగా కస్టమర్ల చేతిలో ఉండనుంది. ఎందుకంటే గతంలోనూ డజన్ల కొద్ది టెలికాం కంపెనీలు వచ్చి కనుమరుగైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications