DTH Operations: ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారతదేశంలోని టెలికాం కంపెనీల మధ్య ఆట ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి చేరుకోనుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇండియన్ కంపెనీలను అణగదొక్కేందుకు ఏకంగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు రంగంలోకి దిగటంతో ఆట హీటెక్కిపోతోంది. అయితే ఒకేసారి రెండు ఆగటు భారతీయ టెలికాం దిగ్గజాలు ఆడగలావా అన్నదే ఇక్కడి అసలు ప్రశ్న.
ప్రస్తుతం అసలు విషయంలోకి వస్తే ఇండియన్ టెలికాం రంగంలో ప్రస్తుతం పోటీ అంబానీలకు చెందిన జియో మిట్టల్ యాజమాన్యంలోని ఎయిర్‍టెల్ మధ్య ప్రధానంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్య పోటీ ఈసారి డీటీహెచ్ సేవల విషయంలో మెుదలైంది. ఇక్కడ టాటాల అండ ఉన్న ఎయిర్‍టెల్ డీటీహెచ్ సేవల్లో లైసెన్స్ ఫీజును రద్దు చేయాలని కోరుతుండగా, జియో మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ చర్య ఎయిర్‍టెల్ కు ఉచితంగా స్పెక్షమ్ వినియోగించుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తుందని జియో వాదిస్తోంది. ఈ వ్యవహారంలో రెండు కంపెనీలు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ ముందు తమ వాదనలను వినిపించాయి. ఇతర టీవీ డిస్టిబ్యూషన్ సేవల మాదిరిగానే డీటీహెచ్ సేవలను పరిగణించాలని ఈ క్రమంలో ఎయిర్‍టెల్ అభ్యర్థించింది.

ఎయిర్‌టెల్ లైసెన్స్ ఫీ-ప్రస్తుతం డీటీహెచ్ ఆపరేటర్‌ల నుంచి కంటెంట్ రాబడిపై విధించబడుతుందని-బ్రాడ్‌కాస్టర్‌లకు బదలాయించాలని ప్రతిపాదించింది. ఇదే క్రమంలో జియో మాత్రం లైసెన్స్ ఫీజుల మాఫీని తీవ్రంగా వ్యతిరేకించింది. వాస్తవానికి డీటీహెచ్ సేవలు అందిస్తున్న కంపెనీలు దేశంలో ఇప్పటికే ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపు నుంచి ప్రయోజనం పొందుతున్నాయని, ఇది మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందించబడుతుందని పేర్కొంది. ఫీజు పూర్తిగా రద్దు చేయటం వల్ల మార్కెట్లో పోటీ అసమతుల్యతను సృష్టిస్తుందని, కేబుల్ టీవీ, IPTV ప్రొవైడర్లను ప్రతికూలంగా మారుస్తుందని జియో ట్రాయ్ వద్ద వాదనలు వినిపించింది. అయితే ఆగస్టు 2023లో ట్రాయ్ ఏజీఆర్ ఫీజులను ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని సూచించింది. అలాగే FY27 నాటికి దీనిని పూర్తిగా తొలగించే ప్రణాళికను ప్రతిపాదించింది.
టెలికాం కంపెనీలకు కొత్త సవాల్..
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా ప్రస్తుతం భారతదేశంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వారు భారతదేశానికి అనుసంధానించే సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్స్‌లో బిలియన్ డాలర్లను కుమ్మరిస్తున్నారు. ఇండియాలో భారీగా డేటా వినియోగం పెరగటంతో పాటు, డేటా సెంటర్ల విస్తరణ జరగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా ఈ సంస్థలు పెట్టుబడులు చేస్తున్నాయి. ఈ చర్య దేశీయ డేటా ప్రొవైడర్లు జియో, భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్‌లతో ప్రత్యక్షంగా పోటీ పడేందుకు గూగుల్, మెటాలకు దోహదపడనుంది. ఈ క్రమంలో గూగుల్ తన బ్లూ-రామన్ సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్‌ను 2025 తొలి మూడునెలల్లో ముంబైలో ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మెటా 500-Tbps సామర్థ్యంతో సబ్‌సీ కేబుల్‌ను అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది. దీనికి రానున్న మూడేళ్లలో 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి అవసరమని తెలుస్తోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న వేళ ఇది భవిష్యత్తు అవసరాలను తీర్చనుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications