Reliance JIO: భారత టెలికాం రంగంలో తీవ్ర ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తక్కువ ధరలకే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించటంలో దేశీయ ఆపరేటర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఆగస్టు 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్కెట్ వాటా పరంగా దేశంలోని ప్రముఖ టెలికాం ప్లేయర్ అయిన రిలయన్స్ జియో మే 2023లో 30.4 లక్షల వైర్‌లెస్ సర్వీస్ సబ్‌స్క్రైబర్‌లను కొత్తగా తన నెట్‌వర్క్‌లోకి సంపాదించుకుంది. ఇదే సమయంలో నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా ఇదే సమయంలో 28.15 లక్షల యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్ నివేదించింది.

ఇదే క్రమంలో జియోకు అత్యంత సమీప పోటీదారుగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ మే నెలలో 13.4 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందింది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న BSNL మాత్రం 14.8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. వైర్‌లెస్ వినియోగదారుల్లో మార్కెట్ వాటా పరంగా.. జియో 38.17 శాతం వాటాతో తన బలమైన స్థానాన్ని నిలబెట్టుకుంది. తర్వాత ఎయిర్‌టెల్ 32.57 శాతం, Vi 20.2 శాతం. BSNL 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
ఇక వైర్‌లైన్ చందాదారుల మార్కెట్‌లో జియో 33.18 శాతం వాటాతో ముందంజలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత 25.12 శాతంతో ఎయిర్‌టెల్, 22.26 శాతంతో BSNL, 7.8 శాతంతో MTNL, 7.6 శాతం వాటాను టాటా టెలి కలిగి ఉన్నాయి. మే 31, 2023 నాటికి దాని మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్ బేస్ జియోకు 8.92 మిలియన్లు, ఎయిర్‌టెల్ 6.40 మిలియన్లు, BSNL 3.61 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ 2.15 మిలియన్లు, హాత్‌వే కేబుల్ 1.12 మిలియన్లు ఉన్నట్లు ట్రాయ్ నివేదికలో స్పష్టం చేసింది. మెుత్తానికి లేటుగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ అంబానీ కంపెనీ దాదాపు అన్ని విభాగాల్లోనూ ముందంజలోనే కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications