రిలయన్స్ జియో మరో అద్భుత ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ కస్టమర్లకు నాలుగు రెట్ల (4x) బెనిఫిట్స్ అందించే సరికొత్త రీచార్జ్ ప్రకటన చేసింది. రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, అజియోతో కలిసి ప్రయోజనం అందించనున్నట్లు తెలిపింది. 2016లో ప్రారంభమైన జియో నాలుగేళ్లలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకొని, కొత్త కొత్త ఆఫర్స్‌తో ముందుకెళ్తోంది.

రూ.249 రీఛార్జ్‌తో 4 డిస్కౌంట్స్
తాజా ఆఫర్ సొంతం చేసుకోవాలంటే రూ.249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాలి. వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు ఇస్తుంది రిలయన్స్ జియో. రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, అజియో కూపన్ల ద్వారా కొనుగోళ్లపై డిస్కౌంట్ పొందవచ్చు. రీఛార్జ్ చేసుకున్న ప్రతి కస్టమర్ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో ఇవి జమ అవుతాయి. షాపింగ్ చేసే సమయంలో ఆ కూపన్స్ ద్వారా డిస్కౌంట్లు పొందవచ్చునని తెలిపింది.

అందరికీ వర్తిస్తుంది
రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు షాపింగ్ చేసి ఎలక్ట్రానిక్స్, దుస్తులు, పాదరక్షలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో.. ఎలాగైనా కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఇప్పటికే ఉన్న జియో యూజర్లకు, కొత్త యూజర్లకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులు. అంటే వీరికి అడ్వాన్స్ రీఛార్జ్‌లా ఉపయోగపడుతుంది. ఇప్పటికే చేసిన రీచార్జ్ గడువు ముగిసిన తర్వాత ఉపయోగం. అడ్వాన్స్ రీఛార్జ్ చేసుకున్న వారు మైజియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయని తెలిపింది.

ఆఫర్ పరిమితకాలం
రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.ఈ ఆఫర్ జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో చేసిన రీఛార్జ్‌లకే చెల్లుబాటు ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో తమ ఆఫర్ కస్టమర్లను విశేషంగా ఆఖట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది.


Click it and Unblock the Notifications