దేశీయ దిగ్గజ జ్యువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన కలెక్షన్లను లాంచ్ చేసింది. అభర్ పేరుతో సరికొత్త డిజైన్లలో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇటీవలి వరకు బంగారం ధరలు రోజురోజుకు పెరిగాయి. ఇటీవల తగ్గినప్పటికీ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.55,000 వరకు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రిలయన్స్ జ్యువెల్స్ కస్టమర్లకు బంపరాఫర్లు అందిస్తోంది.

3 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు
అభర్ కలెక్షన్స్‌లో 54 ప్రత్యేకమైన డిజైన్లతో హ్యాండ్‌క్రాఫ్ట్ బంగారం, డైమండ్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి 3 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు ఉన్నాయి. దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌ను అండగా నిలిచినందుకు కస్టమర్లకు కృతజ్ఞతాపూర్వకంగా మీకు మేం రుణపడి ఉన్నామనే థీమ్‌తో ఒక ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేసింది.

30 శాతం వరకు డిస్కౌంట్.. షరతులు
బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీల మీద పై 30 శాతం (ఫ్లాట్), డైమండ్ జువెలరీపై 30 శాతం వరకు తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 31 వరకు ఈ వార్షికోత్సవ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ తెలిపింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక ఆభరణాలు దేశంలోని అన్ని రిలయన్స్ జ్యువెల్స్ దుకాణాలలో లభ్యమవుతాయి. ఎన్నో ప్రత్యేక ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

కరోనా భద్రతా చర్యలు
ప్రస్తుతం కరోనా నేపథ్యంలోను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. రిలయన్స్ జ్యువెల్‌లోకి ప్రవేశించే సమయం నుండి నిష్క్రమించే వరకు సామాజిక దూరం వంటి వివిధ మార్గదర్శకాలపై భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు ఉన్నట్లు తెలిపింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications