ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాల్ట్ డిస్నీ కో.తో మల్టీబిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందం తర్వాత RIL డిస్నీ స్టార్ వ్యాపారంలో నియంత్రణ వాటాను పొందగలదని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం $10 బిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతా US ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వ్యాపారంలో మైనారిటీ వాటాను కలిగి ఉంటుంది.
రిలయన్స్ ఆస్తులు $7 బిలియన్ నుంచి $8 బిలియన్ల మధ్య ఉన్నాయని, ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్‌బెర్గ్‌కు చెప్పారు. భారీ కొనుగోలును వచ్చే నెలలో కంపెనీలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. డీల్ ప్రకారం డిస్నీ స్టార్‌తో కొన్ని రిలయన్స్ మీడియా యూనిట్లు విలీనమయ్యే అవకాశం కూడా ఉందని బిబి వర్గాలు పేర్కొంటోన్నాయి. ఇప్పటి వరకు వాటాల బదిలీకి సంబంధించిన డీల్ లేదా వాల్యుయేషన్‌పై ఏకాభిప్రాయం లేదు. ప్రతిపాదన ప్రకారం, నగదు, స్టాక్ స్వాప్ లావాదేవీ పూర్తయిన తర్వాత డిస్నీ భారతీయ కంపెనీలో మైనారిటీ వాటాను కొనసాగించే అవకాశం ఉంది.

ఈ విషయమై స్పందించేందుకు భారతదేశంలోని డిస్నీ ప్రతినిధి స్పందించలేదు. ఇటు రిలయన్స్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను $2.7 బిలియన్లకు ప్రసారం చేయడానికి అంబానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. IPL ఒప్పందం తర్వాత, రిలయన్స్ తన జియో సినిమా ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశీయ క్రికెట్ టోర్నమెంట్‌ను ఉచితంగా ప్రసారం చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, రిలయన్స్ భారతదేశంలో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్ HBO షోలను ప్రసారం చేయడానికి మరొక ఒప్పందం చేసుకుంది.
భారతదేశ వినోద పరిశ్రమలో నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, డిస్నీ స్టార్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించింది. ఇది పూర్తి విక్రయం లేదా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడంతో సహా వ్యాపారం కోసం ఇతర ఎంపికలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. డిస్నీ భారతదేశంలో గణనీయమైన లాభాలను పొందడం కొనసాగించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవలి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ రికార్డు స్థాయిలో 43 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది.


Click it and Unblock the Notifications