Reliance IPO: మరో IPOతో మార్కెట్‌ను షేక్ చేయనున్న రిలయన్స్.. అరుదైన ఛాన్స్ కోసం గెట్ రెడీ
IPO News: కరోనా అనంతరం పలు కంపెనీలు IPOలుగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. కొన్ని ఇన్వెస్టర్లను సంపన్నులను చేయగా.. మరికొన్ని భారీ నష్టాలను మిగిల్చాయి. దేశీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇదే విధంగా అరంగేట్రం చేసింది. అయితే తాజాగా రిలయన్స్ నుంచి మరో IPO మార్కెట్లను షేక్ చేసేందుకు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్‌కు సంబంధించి పలు కంపెనీలు మార్కెట్లో ఉన్నా IPOగా మార్కెట్లోకి రావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. కాగా ఇప్పుడు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ IPOగా ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పబ్లిక్ ఆఫరింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. దీని విలువ 100 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జియో కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 90 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో టారిఫ్స్ పెంచాలని చూస్తోంది. దీంతో వాల్యుయేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటగా జియోను టెలికాం ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడు ఏర్పడిన బజ్ మరోసారి IPO వేళ కనిపించవచ్చని అంచనాలు ఉన్నాయి.
అయితే జియో ఇన్ఫోకామ్ IPO ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఏదైనా మంచి సందర్భం చూసుకుని అనౌన్స్ చేయవచ్చని భావిస్తున్నారు. రిలయన్స్ నుంచి పెద్దగా IPOలు లేకపోవడం, సంస్థ మంచి వృద్ధిని కనబరచడం రానున్న పబ్లిక్ ఆఫరింగ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications