Reliance Record: దేశంలో సరికొత్త రికార్డు సృష్టించిన అంబానీ.. అదానీ, టాటాలు దిగదుడుపే..
Muesh Ambani: రిలయన్స్ గ్రూప్ దశాబ్దాల కిందట ధీరూభాయ్ అంబానీ నేతృత్వంలో ప్రారంభమైన ఒక చిన్న సంస్థ. అయితే ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించదగిన కంపెనీల జాబితాలోకి వచ్చి చేరింది. ఈ క్రమంలోనే సరికొత్త రికార్టును సృష్టించింది.
ఫిబ్రవరి 13న తొలిసారిగా అంబానీ అధినేతగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్లను దాటేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర ఏకంగా 14 శాతం మేర ర్యాలీని నమోదు చేసింది. దీంతో ఉదయం 11.16 గంటల సమయంలో రిలయన్స్ షేర్ బీఎస్ఈలో రూ.2,957 మార్కును అందుకుంది.

వాస్తవానికి రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 2005లో లక్ష కోట్ల మార్కును అధిగమించింది. ఆ తర్వాత 2007 సెప్టెంబరులో రూ.2 లక్షల కోట్లకు చేరుకోగా.. అక్టోబరులో రూ.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 12 ఏళ్లు గ్యాప్ తీసుకుని 2017లో రూ.5 లక్షల కోట్ల మార్కును అందుకుంది. తన ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ 2019 నవంబరులో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లకు కంపెనీ విలువ ఎగబాకింది. తాజా ర్యాలీ కారణంగా కంపెనీ విలువ ఏకంగా రూ.20 లక్షల భారీ మార్కును అందుకుని సరికొత్త మైలురాయిని అధిరోహించింది.
విశ్లేషకుల అంచనా ప్రకారం ఆయిల్ నుంచి కెమికల్స్ వరకు అనేక వ్యాపారాల్లో ఉన్న సంస్థ ఇటీవల అధిక ఆయిల్ ధరలు కంపెనీ లాభాన్ని పొందగలిగిందని అంటున్నారు. ఇదే సమయంలో వారు పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, షిప్పింగ్ సమయాలతో సహా రాబోయే అంతరాయాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రిలయన్స్ టెలికాం వెంచర్ జియో వ్యాపారం 2025 ఆర్థిక సంవత్సరంలో 47 శాతం మార్కెట్ వాటాను పొందగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాపారంలో అంబానీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మిగిలిన కంపెనీల మనుగడకు పెద్ద ముప్పుగా మారారు. ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications