రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ నేటి నుండి ప్రారంభమవుతోంది. ఇందుకు 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకు రూ.1,257 ధరను కేటాయించింది. కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారు తమ వద్ద గల ప్రతి 15 షేర్లకు ఒక షేరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ జూన్ 3వ తేదీన ముగియనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ రైట్స్ ఇష్యూకు వచ్చింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ రైట్స్ గురించి కొన్ని అంశాలు..

42.26 కోట్ల షేర్లు జారీ
- రైట్స్ ఇష్యూలో భాగంగా రిలయన్స్ 42.26 కోట్ల షేర్లను జారీ చేస్తుంది. వీటి ద్వారా రూ.53,125 కోట్లను సమీకరించాలనుకుంటోంది. మంగళవారం NSEలో రిలయన్స్ షేర్ 2.2 శాతం పడిపోయి రూ.1,409 వద్ద క్లోజ్ అయింది. ఈ ధరతో పోలిస్తే రైట్స్ ధర రూ.152 డిస్కౌంట్‌లో లభిస్తోంది.
- రైట్స్‌కు దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లు తొలుత 25% అంటే రూ.314.25 చెల్లించాలి. మిగతా మొత్తాన్ని వచ్చే ఏడాది మే, నవంబర్ నెలల్లో రెండు దఫాలుగా చెల్లించే వెసులుబాటు ఇస్తోంది కంపెనీ. వచ్చే ఏడాది మే లోపు రూ.రూ.314.25, మిగతా రూ.628.5ను 2021 నవంబర్ నెలలోపు చెల్లించాలి.

అతిపెద్ద రైట్స్ ఇష్యూ
- మే 9వ తేదీన జరిగిన సమావేశంలో బోర్డు డైరెక్టర్స్ రైట్ ఇష్యూ కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లకు ఈ లేఖ అందుతుంది.
- ప్రతి షేర్ హోల్డర్‌కు ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను రూ.1257కు కేటాయిస్తోంది.
- రూ.10 ముఖవిలువ కలిగిన 42,26,26,894 షేర్లు విక్రయిస్తోంది.
- 2020 మార్చి క్వార్టర్ ఫలితాల వెల్లడి సమయంలో ఇది అతిపెద్ద రైట్స్ ఇష్యూ అని కంపెనీ తెలిపింది.

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల ద్వారా..
- రైట్స్ ఇష్యూను మేనేజ్ చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తొమ్మిది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను అపాయింట్ చేసినట్లుగా తెలుస్తోంది. సిటి గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఉన్నాయి.
- రైట్స్ హోల్డర్లు మే 29వ తేదీ వరకు ప్రత్యేక విండోలో అమ్మవచ్చు.

రుణరహిత కంపెనీ దిశగా..
రిలయన్స్‌ను 2021 మార్చి వరకు రుణరహిత కంపెనీగా నిలబెట్టాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల డిజిటల్, మొబైల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో వాటాల్ని విక్రయిస్తున్నారు. గత నెల రోజుల్లో రిలయన్స్ జియో ప్లాట్‌పాంలో ఫేస్‌బుక్, పీఈ సంస్థలు విస్టా పార్టనర్స్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ సంయుక్తంగా 14.81% వాటాను కొనుగోలు చేశాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 67,195 కోట్లను సమీకరించింది. చమురు మార్కెట్లో రూ.7,000 కోట్లకు బీపీకి విక్రయిస్తోంది. దీంతో మొత్తం రూ.74,000 కోట్లు సమీకరించినట్లు. నెట్ రుణాలు రూ.1.61 లక్షల కోట్లు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications