Reliance Industries: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలో పెద్ద ఆటకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తన ఆట మెుదలుపెట్టడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో గుజరాత్ తర్వాత ఏపీని తన పెట్టుబడికి గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఏపీలో కొత్తగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఏపీ పెద్ద ఆట ఆడేందుకు వీలు కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.65 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని అంబానీ నిర్ణయించగా దీనికి సంబంధించిన ఎంఓయూ నేడు జరగనుంది. వాస్తవానికి గుజరాత్ తర్వాత క్లీన్ ఎనర్జీ రంగంలో ఇంత భారీ స్థాయిలో అంబానీ పెట్టుబడిగా పెడుతోంది ఏపీలో కావటం విశేషం. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.130 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.

ఏపీలో రిలయన్స్ గ్రూప్ తలపెడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ మెుత్తంగా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఏపీ సర్కార్ అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ లో క్లీన్ ఎనర్జీకి సంబంధించిన భాగాన్ని అంబానీ చిన్న కుమారుడు అనంత్ చూస్తున్నందున ఈ మెగా ప్రాజెక్టు ఆయన చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ముందు అనంత్ అంబానీనికి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ముంబైలో కలిసి పెట్టుబడి ప్రాజెక్టును కొలిక్కి తీసుకొచ్చారు. దీనికి తోడు గతవారంలో మంత్రి లోకేష్ సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ సీఈవోతో మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాల గురించి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తన క్లీన్ ఎనర్జీ పాలసీ కింద బయో ఫ్యూయల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో ఏపీ సర్కార్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై పెట్టిన ఫోకస్ గురించి ఈ పెట్టుబడులు చెబుతున్నాయి. ప్రభుత్వం CBG ప్లాంట్‌లపై స్థిర మూలధన పెట్టుబడిపై 5 ఏళ్ల పాటు 20% రాయితీని అందిస్తుంది. అలాగే స్టేట్ జీఎస్టీని సైతం ఐదేళ్ల పాటు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి తమ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో అనేక ప్రోత్సాహకాలతో ముందుకొచ్చినట్లు ఏపీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications