Mukesh Ambani: దేశంలోని అత్యంత సంపన్నుడి స్థానాన్ని కొనసాగిస్తున్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఆయిల్ అనుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లో కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తాజాగా ట్రెండింగ్ లో ఉన్న మరో రంగాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతిపెద్ద సీక్రెట్ డీల్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సోలార్ ప్యానెళ్ల తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకునేందుకు చైనాకు చెందిన సరఫరాదారుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బొగ్గు లేకుండా పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ విధంగా సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలు ప్రస్తుతం తమ ప్రణాళికలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీలు తమ సోలార్ పవర్ ఉత్పాదన పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా చైనాకు చెందిన లింటన్ టెక్నాలజీస్‌తో రిలయన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. లింటన్ టెక్నాలజీస్ సౌర ఫలకాలను తయారు చేయడానికి ఉపయోగించే సెల్‌ల కోసం పొరల తయారీలో చైనాలో నంబర్ వన్ తయారీదారుగా ఉన్నందున రిలయన్స్ ఈ సంస్థతో జతకట్టిందని తెలుస్తోంది. ఈ కంపెనీకి రిలయన్స్ భారీ ఆర్డర్ ఇచ్చిందని తెలిసింది. 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వేఫర్ల తయారీకి సంబంధించిన యంత్రాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్‌ల కోసం డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే అదానీ గ్రూప్ ఈ రంగంలో ముందుగా అడుగుపెట్టి వేగంగా వృద్ధి చెందుతోంది.
ఇప్పటికే అదానీ గ్రూప్ దేశంలో రెండు గిగావాట్ల సోలార్ పవర్ పార్కులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వీలైనంత త్వరగా 8 గిగావాట్లకు చేర్చాలని చూస్తోంది. ఇదే క్రమంలో అంబానీ సైతం దూకుడు పెంచటంతో ఇద్దరి మధ్య పోటీ పెరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అదానీని అధిగమించటానికి.. 10 GW సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ముడి పదార్థాల కోసం లింటన్ టెక్నాలజీస్ గ్రూప్ వద్ద రిలయన్స్ ఆర్డర్ పెట్టిందని తెలుస్తోంది. రిలయన్స్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో 20 GW సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందుకోసం యంత్రాల కొనుగోలు కోసం కంపెనీ ఇప్పటికే 20 మంది సరఫరాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా రిలయన్స్ త్వరలో ఈ టెక్నాలజీని ఇండియాకు తీసుకురానుందని అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications