Reliance: AI కోసం అమెరికా కంపెనీతో జతకట్టిన అంబానీ.. ముందుగానే మెగా ప్లాన్..
Mukesh Ambani: ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న అంబానీ కన్ను ప్రస్తుతం ఏఐ మీద పడింది. ప్రాముఖ్యతను గుర్తించిన రిలయన్స్ అందరి కంటే ముందుగా అడుగుపెట్టేందుకు అమెరికా కంపెనీతో తాజాగా జతకట్టారు.
భారత భవిష్యత్తులో వివిధ ప్రాంతీయ భాషలకు ఏఐ అవసరాలకు అనుగుణంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్లను సిద్ధం చేసేందుకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ Nvidiaతో జతకట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్లు సహజ భాషా ప్రాసెసింగ్ సిస్టమ్‌లు, ఇవి భారీ వచన వాల్యూమ్‌లపై శిక్షణ పొందుతాయి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు జనరేట్ చేసే సామర్థ్యాలను ఇవి కలిగి ఉంటాయి. ఇప్పటికే చాట్ జీపీటీ ఈ సేవలను అందిస్తుండగా.. అవి ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాయి.

దేశంలోని పారిశ్రామిక రంగానికి మద్దతునిచ్చేందుకు ఒక ప్రధాన అడుగులో ఈ ఒప్పందం జరిగినట్లు రిలయన్స్ ప్రకటించింది. విభిన్న భాషలు మాట్లాడే ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశానికి సేవ చేయడానికి AI అప్లికేషన్లకు అనుగుణంగా రూపొందించబడతాయని Nvidia వెల్లడించింది. ప్రాజెక్ట్‌కు అవసరమైన కంప్యూటింగ్ శక్తిని తాము అందిస్తున్నట్లు Nvidia తెలిపింది. వైద్యులు తక్షణమే అందుబాటులో లేని ప్రదేశాల్లో రోగి లక్షణాలు, ఇమేజింగ్ స్కాన్‌ల నిపుణుకు AI సహాయపడుతుందని పేర్కొంది.
అలాగే దశాబ్దాలకు చెందిన వాతావరణ శాఖ డేటాను ఏఐ విశ్లేషించటం ద్వారా తుపానులను సరిగా అంచనా వేయగలదని వెల్లడైంది. ఈ క్రమంలో Nvidia అత్యంత అధునాతన NVIDIA® GH200 Grace Hopper Superchip, NVIDIA DGXTM క్లౌడ్, క్లౌడ్‌లోని AI సూపర్‌కంప్యూటింగ్ సేవకు యాక్సెస్‌ను అందిస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీని రిలయన్స్ తన టెలికాం వ్యాపారం జియోలో సైతం వినియోగించుకుని వ్యాపార సామర్థ్యాలను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రధాని మోదీ అమెరికన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎన్విడియా జెన్సన్ హువాంగ్‌ను కలిసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.


Click it and Unblock the Notifications