ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైనా నేషనల్ కెమికల్ కార్ప్(ChemChina) నుండి 1.2 బిలియన్ డాలర్లకు సోలార్ ప్యానెల్ మేకర్ RECని కొనుగోలుకు సిద్ధమైంది. ఈ డీల్ దాదాపు పూర్తి కావొచ్చే దశలో ఉంది. రూ.75,000 కోట్ల క్లీన్ ఎనర్జీలో భాగంగా నార్వేజియన్ సోలార్ మోడ్యూల్ మేకర్ ఆర్ఈసీ గ్రూప్‌ను ఆయిల్ టు టెలికం దిగ్గజం రిలయన్స్ 1 బిలియన్ నుండి 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుందని చెబుతున్నారు.
ఈ డీల్ కోసం అంతర్జాతీయ బ్యాంకుల నుండి 500 డాలర్ల నుండి 600 డాలర్ల మేర సమకూర్చుకునేందుకు రిలయన్స్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. మిగతా మొత్తాన్ని ఈక్విటీ రూపంలో సిద్ధం చేసుకోనుంది. ఈ కొనుగోలు ద్వారా రిలయన్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ ఉత్పాదక సామర్థ్యాలను యాక్సెస్ చేయడానికి డోర్లు తెరిచినట్లవుతుంది. సౌర శక్తిలో విస్తరించే ప్రణాళికలో మరో అడుగు పడుతుంది.

REC గ్రూప్ 1996లో స్థాపించబడింది. ఇది ప్రభుత్వ రసాయనాల కెమ్‌చైనా అంతర్జాతీయ మెంబర్. పిరెల్లీ టైర్స్, సింజెంటాలలో అతిపెద్ద వాటాదారు. సోలార్ ఫోటోవోల్టాయిక్(PV)కి REC గ్రూప్ అతిపెద్ద యూరోపియన్ బ్రాండ్. వార్షిక సోలార్ ప్యానెల్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 గిగావాట్స్(GW) ఉంటుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 10GW కెపాసిటీని ఇన్‌స్టాల్ చేసింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే భారత్ 175GW రిన్యువబుల్ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సోలార్ ప్యానెల్ మార్కెట్‌లో బిజింగ్ ఆధారిత కంపెనీ ట్రినా సోలార్ లిమిటెడ్, జింకో సోలార్ తదితర కంపెనీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. భారత్‌లో కేవలం 3GW సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం ఉంది. సోలార్ మాడ్యూల్స్ 15GB మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో చైనా ముందు ఉంది. అదే సమయంలో భారత్, అమెరికా దేశాలు భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ దేశాలు స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి లేదా సరఫరా సోర్సెస్‌ను పెంచుకుంటున్నాయి. 2019 బెర్న్ రూటర్ రీసెర్చ్ నివేదికను ఉదహరిస్తూ ఫైనాన్షియల్ డైలీ సోలార్ పవర్, సోలార్ ప్యానెల్, సోలార్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ సామర్థ్యంపై ఓ అంశాన్ని పేర్కొంది. చైనాలోని జింజియాంగ్ ప్రోవిన్స్ నుండి 33 శాతం ఉత్పత్తి అవుతోందని తెలిపింది.


Click it and Unblock the Notifications