రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఈ కంపెనీ షేరు స్టాక్ మార్కెట్‌లో మంగళవారం దూసుకెళ్లి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
దీంతో మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో మొట్టమొదటి అతిపెద్ద కంపెనీగా ఆర్ఐఎల్ అవతరించింది. రిలయన్స్ తరువాతి స్థానాలలో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిలిచాయి.

సరికొత్త శిఖరాలకు ఆర్ఐఎల్ షేరు...
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సరికొత్త శిఖరాలను తాకింది. ఒక దశలో 3.4 శాతం లాభపడి, రూ.1,508.45తో బీఎస్‌ఈలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. దీంతో రిలయన్స్ రూ .9.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన సంస్థగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌ను సాధించే దిశగా కూడా పరుగులు పెడుతోంది.

ఒక్క ఉద్యోగితో, రూ.1000 మూలధనంతో మొదలై...
1966లో ఒకే ఒక్క ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) ధీరూబాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ఆ తరువాత ఆయన తన కలను సాకారం చేసుకున్నారు. రిలయన్స్‌ను ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దారు. 1977లో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి రెండున్నర ఏళ్లకు రిలయన్స్ షేరు విలువ రెట్టింపు అవుతూ వస్తోంది.

10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ దిశగా...
2019 ఒక్క ఏడాదిలోనే రిలయన్స్ షేరు ధర ఇప్పటి వరకు 35 శాతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మొదటి భారతీయ సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 9.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించి 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది.

2, 3 స్థానాల్లో.. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
దేశీయ కంపెనీల మార్కెట్ విలువ విషయానికి వస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా.. ఇక ఈ రేసులో రెండో స్థానంలో నిలిచిన ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లు. కాగా.. మూడో స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications