Reliance Q3 Results: ముఖేష్ అంబానీ నేతృత్వంలో దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో అంబానికి చెందిన కంపెనీలు సూపర్ ఆదాయాలను నమోదు చేశాయి.
డిసెంబరులో ముగిసిన క్యూ3లో రిలయన్స్ లాభం ఏడాది ప్రాతిపదికన 9.3 శాతం పెరిగి రూ.17,256 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో ఆదాయం 3.6 శాతం పెరిగి ఏకంగా రూ.2.36 లక్షల కోట్లుగా నిలిచింది. కంపెనీ మార్కెట్ అంచనాలను అధిగమించినప్పటికీ, ఆదాయ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లైన్‌ను కోల్పోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ రిటైల్..
అంబానీ కుమార్తె ఇషా నేతృత్వంలో కొనసాగుతున్న రిలయన్స్ రిటైల్ పనితీరును పరిశీలిస్తే.. మూడవ త్రైమాసికంలో నికర లాభం 32 శాతం పెరిగి రూ.3,165 కోట్లుగా నిలిచింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం గరిష్ఠ స్థాయికి చేరుకుని డిసెంబర్ త్రైమాసికంలో రూ.83,063 కోట్లుగా నిలిచింది. ప్రధానంగా గ్రాసరీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విక్రయాలు పెరుగుదల దీనికి కారణంగా కంపెనీ పేర్కొంది. ఇషా చేతిలో పడిన తర్వాత కంపెనీ గతంలో ఎన్నడూ చూడని వేగంతో ముందుకు సాగుతోంది. కంపెనీ కొత్త ఉత్పత్తులను పెంచుతూ వినియోగదారు అనుభవాన్ని పెంచే క్రమంలో ఉంది.

రిలయన్స్ జియో..
ఇదే క్రమంలో అంబానీ కుమారుడు నడుపుతున్న టెలికాం వెంచర్ రిలయన్స్ జియో మూడవ త్రైమాసికంలో నికర ఆదాయాన్ని 12.2 శాతం పెంచుకుని రూ.5,208 కోట్లుగా నివేదించింది. ఈ క్రమంలో సగటు వినియోగదారు నుంచి వస్తున్న ఆదాయం కంపెనీకి రూ.181.7గా ఉంది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.3 శాతం పెరిగి రూ.25,368 కోట్లుగా రికార్డ్ అయ్యింది. ఇదే క్రమంలో జియో ఫ్లాట్‌ఫారమ్స్ నికర లాభం 11.6 శాతం పెరిగి రూ.5,445 కోట్లుగా నిలిచింది. ఈ కాలంలో కంపెనీ తన వినియోగదారుల సంఖ్యను సైతం గణనీయంగా పెంచుకోవటం విశేషం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications